సినీమా ఇండస్ట్రీతో పాటు పలు రంగాలలో ఎన్నాళ్లుగానో తిష్టవేసిన కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఇప్పుడిప్పుడే మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తాము ఎదుర్కోన్న ఘటనలను సమాజాం ముందుకు తీసుకువస్తూ.. ఎదుర్కోంటున్నారు. ఈ తరుణంలో ఓ సినీ ట్రైనింగ్ అకాడమిలో చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. నటన నేర్పించాలంటే నటనా విలువలు తెలిసుండాలని చెబుతారే తప్ప.. ఈ మాస్టారు మాత్రం వంటిపై వలువలు మాత్రం ఉండరాదంటూ.. అవి లేకపోతేనే నటన వస్తుందంటూ అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. అయినా అక్కడ కూడా చాలా జాప్యం జరిగింది. హైదరాబాద్ హిమాయత్ నగర్లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణగూడలో వినయ్ వర్మ సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ను నడుపుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే బాధిత యువతితో పాటూ సహా మరో ఎనిమిదిమంది నటన నేర్చుకునేందుకు చేరారు. ప్రతి రోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి 9.30 వరకు క్లాస్ జరుగుతోంది.
రెండు రోజుల క్రితం బాధిత యువతి క్లాస్‌కు వెళ్లింది. ఆమెతో పాటూ మిగిలిన ఎనిమిదిమంది రూమ్‌లోకి వెళ్లగానే వినయ్ వర్మ తలుపులు, కిటికీలు మూసేయమని చెప్పాడట. గదిలో ఉన్న అందర్ని బట్టలు విప్పమని వినయ్ వర్మ చెప్పాడు. అతడి మాటలతో షాక్ తిన్న కొందరు యువతులు అందుకు ఒప్పుకోలేదట. వెంటనే వినయ్ వర్మ యువతిని తిట్టి బయటకు పంపించాడట. వారిలో ఓ యువతి మాత్రం వర్మ చెప్పినట్లు బట్టలు తీసేసినట్లు బాధిత యువతి చెప్పుకొచ్చింది.
వెంటనే తాను ఈ వేధింపుల విషయాన్ని.. షీ టీమ్ దృష్టికి తీసుకెళ్లానని.. ఏసీపీ నర్మద సలహాతో నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదని బాధితురాలు చెబుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు దాదాపు ఏడు గంటల సమయం వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని.. తన జీవితంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారని వాపోయింది బాధితురాలు.
ఇదిలా ఉంటే.. యువతి వేధింపులపై యాక్టింగ్ స్కూల్ డైరెక్టర్ వినయ్ వర్మ స్పందించారు. యువతిని బట్టలు తీయమన్నది నిజమే కానీ.. పై దుస్తులు మాత్రమే తీయమన్నానన్నారు. ఆవిడకు డ్యాన్స్‌పై అంత ఇంట్రస్ట్ లేదని.. అందుకే తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. 20 ఏళ్ల నుంచి ఎంతోమందిని హీరో, హీరోయిన్లు, నటులుగా తీర్చిదిద్దానన్నారు. తన శిష్యులు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. నటనలో భాగంగా.. డ్రెస్ విషయంలో ఎవర్నీ ఒత్తిడి చేయలేదన్నారు. ఒకవేళ ఆమెకు నచ్చక పోతే వెళ్లొచ్చని చెప్పానన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more