1381 kg of gold seized by election flying squad in TN తిరుమల శ్రీవారిపై ఎన్నికల కోడ్ ప్రభావం.. 1381 కేజీల బంగారం సీజ్..

Tamil nadu election commission seized 1381 kg gold which belongs to ttd

Tirumala Tirupati Devasthanams, Hindu temples in Chittoor district, Chittoor district, Tirupati, Districts of India, Vishnu temples, Hindu holy cities, Venkateswara Temple, Tirumala, TTD, Tirumala, Devasthanam, Kalyana Venkateswara Temple, Election commission, EC checks, 1381 kg of gold, Tamil Nadu

About 1,300 kg of gold, apparently being taken to Tirumala Tirupati Devasthanams(TTD), which runs the Lord Venkateswara temple in Andhra Pradesh, was seized by election flying squad officials

ITEMVIDEOS: తిరుమల శ్రీవారిపై ఎన్నికల కోడ్ ప్రభావం.. 1381 కేజీల బంగారం సీజ్..

Posted: 04/17/2019 10:17 PM IST
Tamil nadu election commission seized 1381 kg gold which belongs to ttd

దేశవ్యాప్తంగా ఎలక్షన్ నియమావళి అమల్లో వున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు విసృత్తంగా చేస్తున్న తనిఖీలలో భాగంగా భారీ ఎత్తున నగదు, బంగారం లభ్యం అవుతోంది. అయితే ప్రధాని కర్నాటక పర్యటన సందర్భంగా ఆయన హెలికాప్టర్ లోంచి దించిన ట్రంకు పెట్టలో ఏం తీసుకువచ్చారన్న ప్రశ్నలతో పాటు అరుణాచల్ సీఎం కాన్వాయ్ లో లభించిన రెండు కోట్ల రూపాయల నగదుపై కేసులు, విచారణలు జరిగాయా.? అన్న ప్రశ్నలు ఓ వైపు విపక్షాల నుంచి వినిపిస్తున్నా.. మరోవైపు ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు, హెలికాప్టర్ లను సైతం వదలకుండా ఈసీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.

తాజాగా ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తిరుమల వేంకటేశ్వరుడిపై కూడా పడింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381 కిలోల బంగారాన్ని ట్రకులో తరలిస్తుండగా.. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరులో సమీపంలో ఉన్న వెప్పంపట్టులో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బంగారాన్ని రవాణా చేస్తున్న వారి దగ్గర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలూ లేకపోవడంతో నలుగుర్ని అరెస్ట్ చేసి వాహనాన్ని పూందమల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను ప్రశ్నించగా.. తాము తరలిస్తున్న బంగారం టీటీడీకి చెందిందని వారు తెలిపారు.

బంగారం తమదేనని టీటీడీ ఈవో కూడా స్పష్టం చేశారు. మూడేళ్లపాటు ఈ బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేశామని, మూడు వారాల క్రితం గడువు ముగియడంతో వెనక్కి తెప్పిస్తున్నామని ఆయన తెలిపారు. టీటీడి ట్రెజరీకి బంగారాన్ని చేర్చాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు లేఖ కూడా రాశామని ఈవో చెప్పారు. బంగారాన్ని వెనక్కి ఇచ్చేందుకు ఈసీ అంగీకరించిందని ఈవో తెలిపారు. గురువారం ఉదయం ఈ బంగారం తిరుమల చేరే అవకాశం ఉంది. తనిఖీలలో పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ టీటీడీ ఇచ్చిన లేఖతో ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే బ్యాంకు అధికారులు ఎలక్షన్ కమిషనర్‌తో మాట్లాడారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles