ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఈవీఎం యంత్రాలలో.. వాటిని పథిలంగా భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ లలో నిక్షిప్తమైవున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపుపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే గత పర్యాయం కూడా ఇలాంటి విశ్వాసాన్నే కనబర్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి ఎవరికీ అవకాశమే లేదని.. సీఎం పీఠాన్ని అధిరోహించేది తమ అధినేత వైఎస్ జగనేనని పూర్తి విశ్వాసంతో వుంది. అధికారం మాదే అంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రకటనలకు కూడా కౌంటర్ ఇస్తోంది.
ఈ క్రమంలో జనసేన పార్టీ నేత సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ కూడా తమ పార్టీ 88 స్థానాలతో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. జనసేన పార్టీ కేవలం 65 స్థానాల్లోనే పోటీ చేసిందనీ, అలాంటప్పుడు పవన్ కల్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 చోట్ల ఎలా విజయం సాధిస్తుందని జోస్యం చెబుతున్నారని వ్యంగంగా ప్రశ్నించారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన లక్ష్మీనారాయణ.. అంతే ఘాటుగా విజయసాయి రెడ్డికి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. మీరు సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో అర్థం కావడంలేదు అంటూ ట్వీట్ చేశారు. "జనసేన పార్టీ సొంతగా పోటీచేసింది 140 స్థానాల్లో. మిత్రధర్మం ప్రకారం బీఎస్పీకి 21, వామపక్షాలకు 14 సీట్లు కేటాయించాం. ఆ విధంగా మొత్తం 175 స్థానాల్లో జనసేన దాని మిత్రపక్షాలు పోటీచేశాయి. మా లెక్కలు కచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగా ఉంటాయి.ఇప్పుడు లెక్కలు సరిచూసుకోవాల్సింది మీరే. అంటూ ట్వీట్ చేశారు.
అంతేకాదు.. మేం సత్యం, న్యాయం అనే అంశాల ప్రాతిపదికన పనిచేస్తున్నాం. ఇప్పటికే మీ తప్పుడు లెక్కల వల్ల అనేకమంది ఇరుక్కున్నారు. ఇకనైనా మంచి లెక్కలు నేర్పే విధానాన్ని మొదలుపెట్టండి" అంటూ ఘాటుగా బదులిచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయని సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. జగన్ కంపెనీలకు ఆడిటింగ్ నిర్వహించి, ఆర్థిక లావాదేవీల లెక్కలను పర్యవేక్షించింది విజయసాయిరెడ్డి కావడంతో లక్ష్మీనారాయణ ఆ కోణంలో పరోక్ష వ్యాఖ్య చేసినట్టు అర్థమవుతోంది. జగన్ పై కేసులను సీబీఐ జేడీ హోదాలో లక్ష్మీనారాయణ చాలాకాలం పాటు విచారణ జరిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more