తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వివాదాస్పదమైన నేపథ్యంలో కాంగ్రెస్ పీసీస అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అధికారుల నిర్లక్ష్యమై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై అసలు స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థులు మార్కులు రాక అత్మహత్యలకు పూనుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
అయితే, తెలంగాణ విద్యాశాఖ మంత్రిని తక్షణం భర్తరఫ్ చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ రాసిన ఉత్తమ్.. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల అలోచనలు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుందామనే ధ్యాసే తప్పితే.. పాలన గాడి తప్పిందని చెప్పడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని, తెలంగాణ విద్యార్థులు.. తెలంగాణ రాష్ట్రంలో పిట్టెల్లా రాలిపోతున్నా పట్టించుకోరా అని ఆయన లేఖలో తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు పథకాలను ప్రవేశపెట్టి.. ప్రజల్లో విరివిగా తిరగి ఉపన్యాసాలు దంచి కోడతారే తప్ప.. నిజాంగా ప్రజల సమస్యలు పరిష్కారానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వర్షాలు పడి కుంటలకు, చెరువులకు గండిపడితే.. తెలంగాణ ప్రజలు యాటలు కోసుకుని పండగ చేసుకుంటున్నారని కేసీఆర్ కు కలపడుతుందని.. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు విపరీత నిర్ణయాలు తీసుకుంటుంటే.. విద్యార్థులు ఫెయిల్ అయినందుకు స్వీటు పంచుకున్నారని కూడా త్వరలోనే కేసీఆర్ అంటారని ఉత్తమ్ కుమార్ వ్యంగంగా వ్యాఖ్యానించారు. అవినీతి ప్రక్షాళన అని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్... ఇంటర్మీడియట్ బోర్టుని ఎందుకు ప్రక్షాళన చేయరు అని ప్రశ్నించారు. మరోవైపు రాజకీయ అవినీతిని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
ఇంటర్ బోర్డు ముందు రేవంత్ రెడ్డి అరెస్టు.,.
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, సంపత్ కుమార్ లు ధర్నా చేపట్టారు. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులను కనీసం బోర్టు కార్యాలయంలోనికి కూడా రానివ్వడం లేదని అన్నారు. తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు అధికారులు సమాధానం చెప్పాలన్న ఆయన.. ఇప్పటి వరకు సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అప్పటికే ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ ధర్నా చేస్తుండగా.. రేవంత్ రాకతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈక్రమంలో పోలీసులు రేవంత్, సంపత్ లను అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more