Was offered Rs 1.5 crore to help frame CJI in harassment case సీజేఐకి వ్యతిరేకంగా కేసు వాదిస్తే రూ.1.5 కోట్లు: న్యాయవాది అరోపణలు

Was offered rs 1 5 crore to help frame cji gogoi in harassment case

Ranjan Gogoi, CJI Ranjan Gogoi harassment allegations, sexual harassment case, conspiracy against Ranjan Gogoi, woman claims allegations of sexual harassment against Ranjan Gogoi, Chief Justice of India, Utsav Bains, Supreme Court lawyer, allegations

Utsav Bains, a Supreme Court lawyer, has claimed that the sexual harassment case against Chief Justice of India (CJI) Ranjan Gogoi was a conspiracy to remove the judge from office.

సీజేఐకి వ్యతిరేకంగా కేసు వాదిస్తే రూ.1.5 కోట్లు: న్యాయవాది అరోపణలు

Posted: 04/22/2019 04:01 PM IST
Was offered rs 1 5 crore to help frame cji gogoi in harassment case

దేశసర్వోన్నత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై కుట్రలో తనను భాగస్వామి చేసేందుకు లంచం ఇవ్వజూపారని సుప్రీం కోర్టు న్యాయవాది ఉత్సవ్‌ బెయిన్స్‌ వెల్లడించారు. సీజేఐ గొగోయ్‌పై లైంగిక వేధింపుల కేసును తమ తరఫున వాదించడంతోపాటు ఆయనకు వ్యతిరేకంగా మీడియా సమావే శం నిర్వహిస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ప్రలోభపెట్టారని బెయిన్స్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. సీజేఐ గొగోయ్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి 22 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై సీజేఐ గొగోయ్‌ స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థకు పెనుముప్పు పొంచి ఉందని, తన ను అస్థిరపరిచేందుకు ‘చాలా పెద్ద శక్తి’ పన్నాగం పన్నుతోందని ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇప్పుడు బెయిన్స్‌ వెల్లడించిన విషయాలు సంచలనం కలిగించాయి. తనకు ముడుపులు ఇవ్వజూపిన వ్యక్తి బాగా శిక్షణ పొందినట్లు కనిపించాడని, లైంగిక ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని తో తనకు గల సంబంధాన్ని ఆ వ్యక్తి స్పష్టంగా చెప్పలేకపోయాడని బెయిన్స్‌ తన ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.

లీగల్‌ ఫీజుగా రూ.50 లక్షలు ఇస్తానని ఆ వ్యక్తి చెప్పాడని తెలిపారు. అతను చెప్పేది కట్టుకథ అని భావించిన తాను ఈ కేసును వాదించేందుకు నిరాకరించానని, అయితే ఆ వ్యక్తి రూ.1.5 కోట్లు ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చాడని పేర్కొన్నారు. అతణ్ని వెంటనే తన కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని చెప్పానని వెల్లడించా రు. సీజేఐ గొగోయ్‌పై కుట్ర జరుగుతోంద ని అనుమానించిన తాను ఢిల్లీలోని తన వర్గాల ద్వారా మరిన్ని వివరాలు సేకరించానని, సీజేఐ చేత రాజీనామా చేయించడానికి మహా కుట్ర జరుగుతోందని అర్థమైందని తెలిపారు.
 
దీని గురించి సీజేఐకి చెప్పేందుకు ఏప్రిల్‌ 19 సాయంత్రం 7 గంటలకు ఆయన నివాసానికి వెళితే ఆయన ఇంట్లో లేరని వెల్లడించారు. శనివారం తర్వాత తాను సీజేఐ కోర్టులో ఏ కేసులోనూ వాదించడానికి హాజరుకాబోనని తెలిపారు. తనకు సీజేతో కానీ ఆయన సన్నిహితులతో కానీ వ్యక్తిగత పరిచయం లేదని, ఈ విషయాన్ని ఎవరైనా నిర్ధారించుకోవచ్చని స్పష్టం చేశారు. తాను సీజేఐను కోర్డు రూము వెలుపల ఏనాడైనా కలసినట్లు ఎవరైనా రుజువు చేస్తే తాను న్యాయవాది వృత్తిని వదులుకుంటానని సవాల్‌ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles