Rahul Gandhi Gets SC Notice Over Rafale Comment లిఖితపూర్వక వివరణకు.. రాహుల్ గాంధీకి సుప్రీం నోటీసులు

Rahul gandhi gets supreme court notice over rafale order comment

congress president Rahul Gandhi, Rahul Gandhi Supreme Court, Rahul Gandhi contempt of court, Rahul Gandhi SC notices, Rahul Gandhi, contempt notice, supreme court rahul gandhi contempt notice, Rahul Gandhi, Supreme Court, contempt notice, chowkidar chor hai, BJP, PM Modi, Congress, National politics

Rahul Gandhi had admitted yesterday that he had misquoted the Supreme Court after its ruling on the Rafale deal and said he had done it as "rhetorical flourish in the heat of political campaigning".

లిఖితపూర్వక వివరణకు.. రాహుల్ గాంధీకి సుప్రీం నోటీసులు

Posted: 04/23/2019 03:54 PM IST
Rahul gandhi gets supreme court notice over rafale order comment

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ దొంగ అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలపై కోర్టు ధిక్కార పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా నిన్న సుప్రీంకోర్టుకు రాహుల్ లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాఫెల్ డీల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను చదవలేదని... ఎన్నికల వేడిలోనే తాను ఆ వ్యాఖ్యలను చేశానని తన వివరణలో రాహుల్ తెలిపారు.

కోర్టు ధిక్కార పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారించింది. 'సుప్రీంకోర్టు తీర్పు గురించి ప్రతివాది (రాహుల్ గాంధీ) తప్పుగా వ్యాఖ్యానించారు. చౌకీదార్ చోర్ అని అర్థం వచ్చేలా కోర్టు మాట్లాడలేదు. రాఫెల్ డీల్ కు సంబంధించిన డాక్యుమెంట్ల గురించే కోర్టు మాట్లాడింది' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ధక్కార పిటిషన్ కు రివ్యూ పిటిషన్ ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ఈ వివాదంలో ఇప్పటికే రాహుల్ గాంధీ అఫిడవిట్‌లో ఇచ్చిన వివరణలో కొంచెం కూడా పశ్చాతాపం కనిపించలేదని అభిప్రాయానికి వచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు .. ఆయనకు మరోమారు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ దఫా జారీ చేసని నోటీసులపై రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించిన కోర్టు... తదుపరి విచారణకు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.  

ఇక రాహుల్ ట్వీట్ పై కూడా దుమారం..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైన సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి ప్రత్యేక సందేశమిచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు.. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. భారతీయులందరికీ న్యాయం జరగాలని కోరకునే వారు.. అందుకోసం విజ్ఞతతో ఓటేస్తారని బలంగా నమ్ముతున్నాను’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

అలాగే ఈ సందర్భంగా ఆయన ఓ లఘుచిత్రాన్ని కూడా పోస్ట్‌ చేశారు. దాన్ని అందరికీ షేర్‌ చేయాలని కోరారు. ఆ చిత్రంలో యువత.. ‘‘మన ప్రభుత్వం, మన ఉపాధి ఏదీ మోసం కావొద్దు. దేశ భద్రత, సుస్థిర ఆర్థిక వ్యవస్థ, కేంద్ర సంస్థల స్వతంత్రత, ప్రజల మధ్య విభేదాల తొలగింపు, దేశ సమగ్రత కోసం పాటు పడే ప్రభుత్వానికే మన తొలి ఓటేద్దాం. మార్పు కోసం ఓటేద్దాం. న్యాయం కోసం ఓటేద్దాం’’ అంటూ సందేశమిచ్చారు. అయితే సరిగ్గా సార్వత్రిక ఎన్నికల మూడవ విడత రోజున ఈ విధంగా ట్వీట్ చేయడంపై దుమారం రేగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Supreme Court  contempt notice  chowkidar chor hai  BJP  PM Modi  Congress  National politics  

Other Articles