ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చీలకు వెళ్లిన క్రైస్తవులను టార్గెట్ చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పాల్పడిన దారుణమారణఖాండలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్రితం రోజు 321గా వున్న సంఖ్య నేటికి 360కి చేరింది. ఈ ఘటనలో క్షతగాత్రులైన అనేక మంది ఇంకా విషమ పరిస్థుతుల్లోనే వున్నారని అక్కడి వైద్యవర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు అక్కడ నెత్తుటేళ్లను పారించాయి.
ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారిలో 39 మంది విదేశీయులు ఉన్నారని అక్కడి అధికారవర్గాలు ధృవీకరించాయి. మరణించిన వారిలో 11 మంది భారతీయులు ఉన్నట్టు భారత విదేశాంగ తెలిపింది. ఈ ఘటనలో ఓ తెలుగు వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. హైదరాబాద్ లో పైలెట్ శిక్షణ పొందుతున్న తులసీరాం శ్రీలంకలో పర్యటిస్తుండగా ఉగ్రదాడి చోటుచేసుకుందని కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది. ఈ పేలుళ్లలో తులసీరాం ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంది. అతని స్వస్థలం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం రేవేంద్ర పాడు.
కాగా, తులసీరాం మృతదేహాన్ని అందుకునేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరోవైపు అతని మృతదేహం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు, మరిన్ని పేలుళ్లకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలు శ్రీలంకను వణికిస్తున్నాయి. మరోవైపు, పేలుళ్లకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న రాత్రి కూడా మరో 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 58కి చేరుకుంది.
శ్రీలంకలో పేలిన మరో బాంబు
ఉగ్రవాదులు దొంగదెబ్బ.. ఆత్మాహుతి దాడులతో రక్తమోడిన శ్రీలంకను ఇంకా బాంబు పేలుళ్లు వదిలిపెట్టినట్టు లేదు. నిన్న లారీ లోడు బాంబులతో వాహనం తిరుగుతుందన్న వార్తలు నేపథ్యంలో శ్రీలంకవాసుల్లో భాయందోళన తీవ్రస్థాయికి చేరగా, ఇవాళ ఆ దేశ రాజధాని కొలంబోలో మరో బాంబు పేలింది. ఇవాళ ఉదయం ఓ సినిమా థియేటర్ వద్ద దుండగులు మోటారు బైక్‌లో పెట్టిన బాంబు పేలింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు, భద్రతా బలగాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఈనెల 21న జరిగిన వరుస పేలుళ్లు మిగిల్చిన విషాదగాయాలను వారు మర్చిపోకముందే ఇలా అడపాదడపా బాంబుపేలుళ్లు వారిని భయకంపితుల్ని చేస్తున్నాయి.
దీంతో అప్రమత్తమైన శ్రీలంక భద్రతా యంత్రాంగం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నా ఇంకా అక్కడక్కడా బాంబులు పేలుతూనే ఉన్నాయి. దీంతో కొలంబో వాసులు వణికి పోతున్నారు. మరిన్ని దాడులు చేసేందుకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదులు ఇంకా ఎక్కడైనా బాంబులు పెట్టారా అన్న దానిపై పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఇప్పటికే అనుమానితులుగా భావించిన 58 మందిని అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more