యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో బాలికల హత్యోదంతం కేసులో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం అదే బావి పక్కనున్న మరో భావిలో మరికొన్ని అస్థికలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు కల్పనను కూడా తానే హత్య చేసి సంచిలో మూటకట్టి ఇతరుల బావిలో పడేశానని చెప్పడంతో.. ఉదయం నుంచి తవ్వకాలు జరిపుతున్న పోలీసులు బావి నుంచి మరికొన్ని అస్థికల్ని వెలికి తీశారు. దొరికిన అస్థికలు నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనవేనా.. లేకా ఇంకొకరివా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రావణి మిస్పింగ్ కేసు నేపథ్యంలో దాఖలైన పిర్యాదు మేరకు కొనసాగుతున్న దర్యాప్తులో హాజీపూర్ నరహంతకుడి విషయం వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం మనీషాను కూడా తానే హత్య చేశానని సొమవారం అంగీకరించిన హంతకుడు.. ఇవాళ తాజాగా నాలుగేళ్ల క్రితం అరో తరగతి చదువుతున్న కల్పనను కూడా హత్యచేసింది తానేనని అంగీకరించాడు. కాగా బావిలో లభ్యమై అస్థికల్ని డీఎన్‌ఏ పరీక్షలు కోసం పంపారు. పరీక్ష రిపోర్టులు వచ్చిన తర్వాతే ఆ అస్థికలు కల్పనవేనా అన్న విషయం తెలుస్తుంది.
అసలు ఎవరీ శ్రీనివాస్ రెడ్డి.. ఎందుకిలా చేశాడంటే..
శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదు నగర శివారల్లోని కీసరలో లిఫ్టు మెకానిక్ గా పని చేస్తున్నాడు. అంతకుముందు ఆయన హాజీపూన్ లో వుండగా, ఓ పశువుల కాపరి అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో పోరుగు గ్రామవాసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అరెస్టైన కొన్ని రోజుల తరువాత బెయిలుపై వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్థులు పంచాయితీ పెట్టించి మరీ కొట్టారు. దీంతో సొంతగ్రామస్థులపై పగ పెంచుకున్న శ్రీనివాస్ రెడ్డి.. ప్రతీకారంగానే అమ్మాయిలను లిప్ట్ ఇస్తానని చెప్పి.. వారిని ఎక్కించుకుని బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more