నగరంలోని ఆర్టీసీ బస్సులో తుపాకీ కాల్పలకు పాల్పడిన వ్యక్తిని పోలీసుల తమ అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాదు నుంచి మణికోండ ప్రాంతానికి వెళ్తున్న బస్సులో పంజాగుట్ట వద్ద గన్ ఫైరింగ్ జరిపిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ ఆర్. శ్రీనివాస్ గా గుర్తించారు పోలీసులు. ఓ ప్రముఖుడికి గన్ మెన్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ తన డ్యూటీని ముగించుకుని అర్టీసీ బస్సు ఎక్కడాని, ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో చోటుచేసుకున్న వాగ్వాదంతో తన వద్దనున్న గన్ తో కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
తొలుత తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి చాతిపై పెట్టి బుల్లెట్ పేల్చేడాని అయితే అప్పుడు అది అదృష్టవశాత్తు పేలలేదని, ఆ తరువాత ఆయన అగ్రహాన్ని దిగమింగుకోలేక బస్సు రూఫ్ పైకి కాల్చారని, దాంతో అది బస్సు టాప్ నుంచి దూసుకుపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రయాణికులతో పాటు బస్సు డైవ్రర్, కండక్టర్ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ అని గుర్తించారు. కాగా నిందితుడ్ని కూకట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిటీ సర్వీసు 47L బస్సు బోర్డుతో (AP28Z4468) నెంబరుతో వెళ్తున్న ఈ బస్సు.. పంజగుట్ట శ్మశాన వాటిక వద్దకు చేరుకోగానే ఈ ఘటన చోటచేసుకుంది. శ్రీనివాస్ ను టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో శ్రీనివాస్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించిన తెలంగాణ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జనం మధ్యలో కాల్పులకు పాల్పడటం తీవ్రమైన నేరంగా అంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ పేర్కోన్నారు. రాష్ట్రంలో పోలీసులకు ఎలాంటి పనివత్తిడి లేదని అన్నారు. శ్రీనివాస్ మానసిక స్థితిపై కూడా తాము విచారణ జరుపుతున్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more