చీపురుతో మర్డర్ చేయవచ్చా..? ఇదే ప్రశ్న మనం వేస్తే వేరు.. కానీ ఏకంగా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ముందుకి ఇలాంటి విచిత్రమైన కేసు వస్తే.. న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారు. ముందుగా విస్మాయానికి గురికాక తప్పదు. ఎందుకంటే.. ఊడ్చేందుకు మాత్రమే పనికివచ్చే చీపురు.. ఉసురు కూడా తీస్తుందా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి. కానీ ఈ కేసును విచారించిన కింది కోర్టు మాత్రం పోలీసుల తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించి.. శిక్షను ఖరారు చేశారు. దీంతో నిందితులు కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు.
ఇక్కడే న్యాయమూర్తులు విస్మయానికి గురై.. కట్టకధలు చెబతున్నారా.. అంటూ అటు పోలీసులపై.. ఇటు ప్రాసిక్యూషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చీపురు కట్ట.. అది కూడా విరిగిపోయిన చీపురుతో కొట్టడం వల్లే ఓ మహిళ చనిపోయిందన్న పోలీసుల ఆరోపణపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చీపురుతో కొడితే చనిపోతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొడితే చనిపోవడానికి చీపురు ఏమైనా మారణాయుధమా అంటూ ప్రాసిక్యూషన్ ను ప్రశ్నించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లాకు చెందిన కామాక్షి అనే మహిళను వెంకటమ్మ, ఆమె కుమారుడు రాజశేఖర్ చీపురు కట్టతో కొట్టి చంపారని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు.. వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్ చేశారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణ సందర్భంగా వెంకటమ్మ, రాజశేఖర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళను నడిరోడ్డుపై విరిగిన చీపురుతో కొట్టి చంపారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నివేదిక ప్రకారం పక్కటెముకలు విరిగి, బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టడం వల్ల వెంకటమ్మ చనిపోయినట్లు తేలింది. దీంతో ఇది హత్య కాదు.. అని కోర్టుకి విన్నవించారు.
పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ మహిళది హత్యే అన్నారు. చీపురుతో కొట్టడం వల్లే చనిపోయిందన్నారు. హైకోర్టు ధర్మాసనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించలేదు. తమాషా చేస్తున్నారని అని సీరియస్ అయ్యింది. చీపురుతో మర్డర్ చెయ్యడం ఏంటని నిలదీసింది. ప్రస్తుతం ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లట్లేదని తెలిపింది. నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చీపురుతో కొట్టడం వల్లే మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా మారింది. పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more