టీవీ9 సీఈవోగా 2004 నుంచి వ్యవహరిస్తున్న రవిప్రకాష్ విషయంలో ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు చివరకు ఆయన తొలగింపుకు దారితీసాయి. ఇవాళ రవిప్రకాష్ ను సీఈవో స్థానం నుంచి తొలగిస్తూ టీవీ9 యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం రవిప్రకాష్ ఇంటితో పాటు.. టీవీ9 కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు పోలీసులు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు.. రవిప్రకాష్ పై ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంస్థకు చెందిన నిధులను కూడా దారి మళ్లించారని రవిప్రకాష్ పై ఫిర్యాదు అందింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాష్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో రవిప్రకాష్ ఇటు టీవీ9 కార్యాలయంలోనూ.. తన నివాసంలోనూ అందుబాటులో లేరు. మరోవైపు సోదాల సమయంలో టీవీ 9 కార్యాలయంలో కొన్ని ఫైళ్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్‌లు మాయం అయినట్టు పోలీసులు గుర్తించారు. హీరో శివాజీతో కలసి రవిప్రకాష్ సంస్థకు హానీ కలిగించేలా వ్యవహరించారని యాజమాన్యం అరోపించింది. కంపెనీకి చెందిన ముఖ్యమైన డేటాను బయటి వ్యక్తులకు అందించారని అయనపై యాజమాన్యం అరోపించింది.
టీవీ9 సీఈవో రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలందా మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు... ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, it యాక్ట్ 66, 72 కింద కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. టీవీ9ను కొనుగోలు చేసిన అలందా మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. టీవీ9లో 91 శాతం అలందా మీడియాకు వాటా ఉండగా.. రవిప్రకాష్‌కు 8.5 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది.
ఒప్పందం సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ పత్రాలని గుర్తించిన అలందా మీడియా... పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తనకు 40 వేల షేర్లు టీవీ9లో ఉన్నాయని, తనకు తెలియకుండా అలందాకు విక్రయించారని శివాజీ ఆరోపించారు. అయితే, రవి ప్రకాష్, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అలందా డైరెక్టర్ కౌశిక్ రావు. ఇక టీవీ9 ఆఫీసు, సీఈవో రవి ప్రకాష్ నివాసంతో పాటు... హీరో శివాజీ నివాసంలోనూ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more