కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలను చేపట్టిన తరువాత పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పూర్తిగా పార్టీ బాధ్యతలను తీసుకున్న రాహుల్ లో ఏమాత్రం గర్వం రాలేదు.. అలా అని అసాధరణ వ్యక్తిగా కాకుండా అతి సామాన్యుడిగా.. జనంలో తాను ఒకరు అన్న వ్యవహార తీరుతో తన పార్టీలోని నేతలే కాదు.. విభిన్న రాజకీయ పక్షనేతలను కూడా అకట్టుకుంటున్నాడు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి వస్తే.. అందుకు తగిన సమర్థత వున్న నేతగా కూడా నిరూపించుకుంటున్నాడు.
అయితే ఆయన నాయకుడే కాదు.. ఆయనలోని మరో కోణం వెలుగులోకి వచ్చింది. జనంలోకి దూసుకెళ్లటం, వాళ్లతో మాట్లాడటం, ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మరీ జనంలో మమేకం అవుతూ వచ్చారు. ఇటీవలి ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న రాహుల్ విమానం గాల్లో వుండగా అనేక సార్లు కుదుపులకు గురైంది. దీంతో తానే ఫైలెట్ వున్న కాక్ పిట్ లోకి వెళ్లి.. పరిస్థితి తెలుసుకుని వారికి కూడా సూచనలిచ్చి.. సేఫ్ ల్యాండింగ్ కు దోహపడిన విషయం మనకు తెలిసిందే. లేటెస్ట్ గా హెలికాఫ్టర్ రిపేర్ చేస్తూ కనిపించారు.
హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరిగి ఢిల్లీ బయలుదేరారు. అంతలోనే హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలెట్లు, ఇతర సిబ్బంది కంగారు పడ్డారు. రాహుల్ మాత్రం కూల్ గా ఉన్నారు. హెలికాఫ్టర్ లో కూర్చున్న ఆయన కిందకు దిగారు. టెక్నికల్ టీంతో కలిసి రిపేర్ చేయటం మొదలుపెట్టారు. కింద పడుకుని మరీ హెలికాఫ్టర్ డోర్లకు సంబంధించిన స్క్రూల్ లను సరి చేశారు. టెక్నికల్ సిబ్బందికి తన వంతు సాయం అందించారు. రాహుల్ తన ఇన్ స్ట్రాగ్రామ్లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
అందరూ కలిసి తలో చేయ్యేసి.. ‘గుడ్ టీం వర్క్’ గా పనిచేయడం వల్లే హెలికాప్టర్ లో తలెత్తిన సమస్యను త్వరగా ఫిక్స్ చేయడం సాధ్యపడిందని ఆయన స్వయంగా ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. రాహుల్ గాంధీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్స్ రాగా, వేలాది కామెంట్లు వచ్చాయి. పార్టీకే కాదు.. హెలికాఫ్టర్ కు కూడా రిపేరు చేస్తున్నారని కొందరు అంటే.. రాహుల్ లో మెకానిక్ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరికొందరు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏడో దశ పోలింగ్ హిమాచల్ ప్రదేశ్ లో మే 19 నుంచి జరుగనున్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more