IMD warns of Higher Temperatures to people of Telugu states రానున్న ఐదు రోజులు అసాధారణ ఉష్ణోగ్రతల నమోదు

Imd warns of higher temperatures to people of telugu states

India Meteorological Department, heat wave, high temperatures, weather-report, warning, summer, heatwave, rains, lighting, telangana, Andhra PradeshIndia Meteorological Department, heat wave, high temperatures, weather-report, warning, summer, heatwave, rains, lighting, telangana, Andhra Pradesh

The Indian Meteorological Department (IMD) has issued warning in Telugu states that high temperatures may record in coming five days. Heat wave may continue in next week

రానున్న ఐదు రోజులు అసాధారణ ఉష్ణోగ్రతల నమోదు

Posted: 05/11/2019 03:41 PM IST
Imd warns of higher temperatures to people of telugu states

ప్రచండ భానుడి ఉగ్రరూపానికి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు నుంచి 47 డిగ్రీల వరకు చేరుకుని మునుపెన్నడూ లేని విధంగా అసాధారణంగ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాల్పులు, ఉక్కపోతలు బయటకు వెళ్లిన వారినే కాదు.. ఇంట్లో వున్న వారిని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రతతో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తాజాగా వాతావరణ కేంద్రం అధికారులు మాత్రం మరో ఐదు రోజుల పాటు భానుడి భగభగలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఎండలో తిరగడం మంచిది కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక రోజుకు ఆరు నుంచి ఏఢు లీటర్ల నీటికి తాగడం మంచిందని కూడా సూచిస్తున్నారు. ఇక రానున్న మరో ఐదారు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఉష్ణోగ్రతలు 43 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చన్న వాతావరణ కేంద్రం అంచనాలతో ప్రజలు భయపడుతున్నారు. రాబోయే ఐదారు రోజుల్లో ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

ఏపీవ్యాప్తంగా 613 ప్రదేశాల్లో 41 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  మరోవైపు తెలంగాణలో శని, అదివారాలు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు, కోస్తాంధ్ర దక్షిణ ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో వర్షాలు కురివడంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles