తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ‘వై ఐ యామ్ నాట్ ఎ హిందు’ గ్రంథ రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెరవెనుక హిందూ ఆధ్యాత్మికవేత్తల పాలన సాగుతుందని అరోపించారు. ఈ క్రమంలో ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని చినజీయర్ పరిపాలిస్తున్నారని కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. ఓ స్వామీజి సీఎం కేసీఆర్ ను కేసీఆర్ ను శాసించి యాగాలు, హోమాలు చేయిస్తే.. మరో స్వామీజీ తెలంగాణను పాలిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు.
హైదరాబాదులోని పంజాగుట్టలో నేలకూల్చిన అంబేధ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వమే పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను శిక్షించాలి అనే అశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దళితులు, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రులను చేస్తానన్న ఆయన కనీసం రెండో పర్యాయమైనా తన హామీని నిలబెట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి హామి ఎమైందని ప్రశ్నించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చినచోటే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేసిన ఆయన.. విగ్రహం కూల్చివేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఎక్కడా అంబేద్కర్ విగ్రహానికి అభివాదం చేసిందే లేదని అరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదని అన్నారు. అన్ని రకాల పీడనలకు, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని, అప్పుడే తెలంగాణలో కుల వివక్ష పోతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కావాలనే దళితులను, కమ్యూనిస్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more