Yadadri Laddu prasadam becomes costlier యాదాద్రి లడ్డూ ఇక ప్రియం.. చక్కర స్థానంలో బెల్లం..

Yadadri laxmi narasimha swamy laddu prasadam becomes costlier

laddu prasadam, jaggery laddu, Yadadri laddu, Yadadri Lakshmi Narasimha Swamy Temple prasadam, Yadadri temple prasadam, endowments department, Telangana government, yadadri EO geeta reddy, Telangana

After the Endowment department gives nod to Yadadri Laxmi Narasimha Swamy Jaggery Laddu Prasadam, the temple EO geeta reddy orders to sell the said prasadam which becomes costlier. The price of laddu has been hiked from Rs 20 to Rs 25.

యాదాద్రి లడ్డూ ఇక ప్రియం.. చక్కర స్థానంలో బెల్లం..

Posted: 05/15/2019 04:35 PM IST
Yadadri laxmi narasimha swamy laddu prasadam becomes costlier

తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రివై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ది చేయాలని భావిస్తున్న తెలంగాణ దేవాదాయశాఖ ఇక భక్తులపై భారం వేస్తోంది. ఆలయ ప్రాకారాలను విశాలంగా నిర్మిస్తూ నూతన ఆలయం నిర్మితమవుతున్న నేపథ్యంలో ఆలయానికి ఒక విశిష్టత వుండేందుకు గాను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు భక్తులపైనే భారం వేయనుంది అలయ కమిటి. శ్రీలక్ష్మీనరసింహస్వామీ మూడు రోజుల జయంతోత్సవ వేడుకల ప్రారంభం సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ్టి నుంచి ఈ భారాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే గుర్తుకువచ్చే నేతి లడ్డూల తరహాలో.. యాదాద్రిని దర్శించుకున్న భక్తులు ప్రసాదంగా పులిహోరా, లడ్డూలు తీసుకెళ్తారు. అయితే తిరుమల లడ్డూల తరహాలో యాదాద్రి లడ్డూకు కూడా ఒక మంచి గుర్తింపు తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచించింది. అందుకోసం ప్రస్తుతం ఇస్తున్న లడ్డూ ప్రసాదాన్ని మార్చాలని నిర్ణయించింది. చక్కర పాకంతో తయారు చేసే లడ్డూలకు బదులుగా బెల్లం పాకంతో చేసిన లడ్డూలను విక్రయించాలని నిర్ణయానికి వచ్చింది.

ఆలయ ఈఓ ఐదుగురు ఏఈఓలు, ఇద్దరు ప్రధాన పూజారులు, ఇద్దరు వంట స్వాములు, ఇద్దరు పర్యవేక్షకులు కలిపి మొత్తం 11 మంది ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ.. కమిటీ అధ్వర్యంలో ప్రయోగాత్మకంగా మూడు పర్యాయాలు బెల్లం లడ్డూ తయారు చేపట్టింది. వంద గ్రాముల బరువున్న లడ్డూ తయారీకి వాడిన వివరాలతో కూడిన నివేదికను రూపోందించి ఆలయ ఈవో దేవాదాయశాఖకు అందజేశారు. దీంతో దేవాదాయ శాఖ అనుమతులు లభించడంతో ఇవాళ్టి నుంచి బెల్లంపాకంతో తాయరు చేసిన లడ్డూలను యాదాద్రి ఆలయ కమిటీ విక్రయించడం ప్రారంభించింది.

ఇదంతా సరే మరి లడ్డూలు ప్రియం అన్నారేంటీ ఆ వివరాలేంటి అంటారా.? బెల్లంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదం విక్రయాలు ఇవాళ్టి నుంచి ప్రారంభించిన దేవస్థానం లడ్డూల ధరలను పెంచింది. నిన్నటివరకూ యాదాద్రిలో పంచదారతో తయారు చేసిన లడ్డూలను ఒక్కొక్కటీ రూ. 20కి విక్రయించారు. దీని బరువు 100 గ్రాములుగా ఉంటుంది. ఇప్పుడు బెల్లంతో చేసిన 100 గ్రాముల లడ్డూను రూ. 25కు విక్రయిస్తారు. ఈ విషయాన్ని లక్ష్మీనరసింహ దేవాలయం కార్యనిర్వహణాధికారి ఎన్‌ గీతారెడ్డి వెల్లడించారు. బెల్లంపాకంతో, నిర్ణీత దిట్టంతో లడ్డూలను ప్రయోగాత్మకంగా తయారు చేసి రుచి, నాణ్యతలను పరిశీలించిన తరువాత.. దేవాదాయ శాఖ అనుమతితోనే అమ్మకాలను ప్రారంభించామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles