లాభాలను ఆర్జించడంలో భాగంగా సీటు అక్యూపెన్సీని పెంచుకుంటూ.. ఎప్పటికప్పుడు పండుగలతో పాటు కాలాలకు కూడా అనుగూణంగా డిస్కౌంట్ ధరలను ప్రకటించే ఎకానమీ విమానయాన సంస్థలు పోటీపడుతుంటడం తెలిసిందే. తాజాగా వేసవి కాలం ముగింపుకు చేరుకుంటున్న తరుణంలో మరో ప్రైవేట్ రంగ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ తో ప్రయాణికుల ముందుకు వచ్చేసింది. ఆఫర్ లో భాగంగా 10 లక్షల సీట్లను డిస్కౌంట్ ధరతో ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది.
ఇండిగో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ లో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.999 ప్రారంభ ధరతో అందిస్తోంది. ఇక విదేశీ ప్రయాణపు టికెట్ ధర రూ.3,499 నుంచి ప్రారంభం కానుందని విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. డిస్కౌంట్ ఆఫర్ మే 14 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనుంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు మే 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్ నాన్ స్టాప్ ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుంది.
మరోవైపు కంపెనీ విమాన టికెట్ల బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది. డిజిబ్యాంక్ డెబిట్ కార్డుతో టికెట్లను బుకింగ్ చేసుకుంటే రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ పొందాలంటే టికెట్ బుకింగ్ విలువ కనీసం రూ.4,000 ఉండాలి. అదే మొబిక్విక్‌తో టికెట్లను బుకింగ్ చేసుకుంటే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
Your fare-y tales will now come true as our sale is here. Plan your vacation from our wide network of 53 domestic and 17 international destinations. So, just start booking, fly daily, fly #IndiGohttps://t.co/9CEUas8C9s#IndiGoBumperSeatSale #10LakhSeats #TenTasticSale pic.twitter.com/F4na8mPBUC
— IndiGo (@IndiGo6E) May 15, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more