PM Modi Offers Prayers At Kedarnath Shrine కేదారేశ్వరుడి సేవలో ప్రధాని మోడీ.. ప్రత్యేక పూజలు

Pm narendra modi offers prayers at kedarnath shrine meditated in cave

Prime Minister Narendra Modi, lok sabha polls 2019, election 2019, Kedarnath, Badrinath, Priyanka Gandhi, Modi is a Big Actor, PM Modi, lok sabha polls 2019, Kedarnath Shrine, special pooja, meditation, kedarnath temple project, Uttarakhand, Politics

Prime Minister Narendra Modi on Saturday offered prayers at Kedarnath, a day after campaigning for the general election came to a close. PM Modi reached Jollygrant airport on Saturday morning from where he directly came here, officials said.

ITEMVIDEOS: కేదారేశ్వరుడి సేవలో ప్రధాని మోడీ.. ప్రదిక్షిణలు, రుద్రాభిషేకం, ధాన్యం

Posted: 05/18/2019 12:27 PM IST
Pm narendra modi offers prayers at kedarnath shrine meditated in cave

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉత్త‌రాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాదేశ్వరుడ్ని దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల చివరి దశకు ప్రచారపర్వం ముగియడంతో ఆయన ఇవాళ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో కేదార్ నాథ్ కు చేరుకున్నారు. తన శక్తి మేరకు ప్రచారం చేసిన ప్రధాని మరోమారు అధికారాన్ని అందించాలని తన హాయంలోని క్రితం రోజున తొలి పత్రికా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా కోరిన ప్రధాని.. ఇక ఈ మేరకు తనను ఆశీర్వదించాలని అటు దైవాన్ని కూడా కోరుతూ ఇవాళ కేధారేశ్వర ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

ప్రత్యేక హెలికాప్టర్ లో కేదార్ నాథ్ ఆలయానికి చేరకున్న ఆయన.. ప్రధాని హోదాలో ఈ ఆలయాన్ని దర్శించడం రెండోసారి. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్ లో ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరకున్న ప్రధాని ప్రదిక్షిణలు పూర్తి చేసిన తరువాత కేదారేశ్వరుడి ప్రత్యేక రుద్రాభిషేకం చేశారు. పూజల తర్వాత ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమీక్ష చేశారు మోడీ.

ఆలయ దర్శనానికి వచ్చిన సమయంలో.. ప్రధాని మోదీ ప్రత్యేక వేషధారణలో ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంప్రదాయ దస్తుల్లో ఆయన మెరిసారు. రెగ్యులర్ గా మోడీ ధరించే డ్రస్ కాకుండా.. ఇలా వెరైటీగా కనిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ బందోబస్తు నడుమ ప్రధాని కేదానాథ్ ను సందర్శించుకున్నారు. భక్తులెవరిని ఆలయ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వలేదు. దీంతో ఆయన ప్రశాంతంగా కేదారేశ్వరుడ్ని దర్శించుకున్నారు. ఆదివారం బద్రినాథ్ ను కూడా మోడీ దర్శించుకోనున్నారు. ఏడు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 పార్లమెంటు స్థానాల్లో రేపు చివరి విడత పోలింగ్ జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles