సైబరాబాద్ పోలీసులు పెట్టిన పోర్జరీ, డాటా చోరి కేసులకు తోడు కంపెనీకి చెందిన లోగో, కాఫీ రైట్స్. ట్రేడ్ మార్కులను కూడా కారుచౌకగా మోజో టీవీకి కట్టబెట్టారన్న పిర్యాదు నేపథ్యంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై మరో కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా.. పట్టించుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆయనపై పోలీసులు కూడా కన్నెర్ర చేస్తున్నారు.
ఆయనతో పాటు టీవీ9 నూతన యాజమాన్యంపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించారన్న అరోపణలను ఎదుర్కోంటున్న నటుడు శివాజీ తీరుపై కూడా పోలీసులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తమకు కొంత సమయం కావాలని వీరిద్దరూ వేర్వేరుగా పోలీసులకు ఈ మెయిళ్లు పంపించాడంతో వాటి ఐపీ అడ్రెస్ లు కనుగోన్న పోలీసులు వారు విజయవాడలోనే వున్నారని కూడా తెలుసుకన్నారు. అయితే వీరు సమయం కోరడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో కేసు కోసం కాలయాపన చేస్తున్నారని భావించిన పోలీసులు.. ఈ కేసు వాయిదా పడిన నేపథ్యంలోనూ వీరు తమ ఎదుట హాజరుకాకపోవడంతో.. వీరు విజయవాడలోనే వున్నారా..? లేక విదేశాలకు పారిపోయారా.? అన్న కోణంలో అలోచిస్తున్నారు.
దీంతో రవిప్రకాష్ సహా నటుడు శివాజీపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వీరిద్దరిపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. తమ అదేశాలను పట్టించుకొకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్రితం రోజు రాత్రి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయినా కూడా హాజరుకాలేదు రవిప్రకాష్. ఈ క్రమంలోనే విదేశాలకు పారిపోకుండా లుక్ ఔట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు.
రవిప్రకాష్, శివాజీ దేశం విడిచిపారిపోయే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారు. దీంతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు. ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపడుతున్నారు. వీరు ఎయిర్ పోర్టుల్లోకి ప్రవేశిస్తే వెంటనే అరెస్టు చేయాలని కూడా ఆదేశించారు పోలీసులు.తో కలసి ఏబిసీఎల్ సంస్థ నూతన యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టేందుకు చేసిన ఇరువురు చేసుకున్న లోగుట్టును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించి.. వెలుగులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయనపై మరో కేసు కూడా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. టీవీ9 సీఈవోగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more