ఎన్నికల సంఘం పనితీరు చట్టబద్ధంగా ఉండాలంటూ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తన శాఖ అధికారులకే రాసిన లేఖ కలకలం రేపుతోంది. నేతలకు క్లీన్ చిట్ ఇచ్చే సమయంలో తన వాదనను రికార్డు చేయలేదంటూ సీఈసీ అరోరాకు లావాసా లేఖ రాశారు. మైనారిటీ అభిప్రాయాలను కూడా రికార్డు చేయాలని లేఖలో లావాసా పేర్కొన్నారు. అయితే మెజారిటీ అభిప్రాయాలను మాత్రమే రికార్డు చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది. దీంతో ఎన్నికల సంఘం పనితీరుపై ఎన్నికల కమిషనర్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లావాసా లేఖతో ఎన్నికల సంఘం ఇరుకున పడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీబీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో అంతర్గత కలహాలు తలెత్తగా ఇప్పుడు ఎన్నికల సంఘంలో కూడా అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలపై ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా స్పందించారు.లవాసా వ్యాఖ్యాలను ఆయన ఖండించారు.దీనిపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘ ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు ఒకేలా ఉండరు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. ఒకరి అభిప్రాయాలు మరొకరితో కలవకపోవడం వంటి సందర్భాలు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. అదే ఇప్పుడు కూడా జరిగింది’ అని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ప్రధాని మోదీ..అమిత్ షాలపై కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అశోక్ అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకోవడం లేదని ఆయన కొద్ది రోజులుగా సమావేశాలకు దూరంగా ఉన్నారు. తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదనేది లవాసా ఆరోపణ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more