Railway TTEs Will Now Have to Check Cleanliness in Toilets of General, Sleeper Coaches సాధారణ బోగీలు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది...

Railway ttes will now have to check cleanliness in toilets of general sleeper coaches

Railways,TTEs, Cleanliness,Indian Railways,Toilets,Travelling Ticket Examiners

Railway TTEs Will Now Have to Check Cleanliness in Toilets of General and Sleeper Coaches

సాధారణ బోగీలు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది...

Posted: 06/15/2019 11:27 AM IST
Railway ttes will now have to check cleanliness in toilets of general sleeper coaches

రైల్వే టీటీఈలకు ప్రయాణికుల టికెట్‌ను చెక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు టికెట్ చెక్ చేయడమే అతని బాధ్యతగా ఉండేది. దీనికి మరో అదనపు బాధ్యతను కూడా రైల్వేశాఖ టీటీఈలకు అప్పగించింది. ఇంతకీ టీటీఈలకు అదనంగా రైల్వే శాఖ ఇచ్చిన బాధ్యతలు ఏమిటి..? రైల్వే శాఖ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో టీటీఈలకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ప్రయాణికుల టికెట్ చెక్ చేయడంతో పాటు జనరల్ మరియు స్లీపర్‌కోచ్‌లలో ఉండే టాయ్‌లెట్స్‌ను చెక్ చేసే బాధ్యత కూడా టీటీఈలు తీసుకోవాల్సి ఉంటుంది. టాయ్‌లెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసి ఒకవేళ శుభ్రంగా లేకపోతే రైలులో ఉండే క్లీనింగ్ సిబ్బందిని పిలిచి వారితో శుభ్రం చేయించేలా ఆదేశించాలని రైల్వేశాఖ తెలిపింది. అంతేకాదు కోచ్‌లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా సిబ్బందికి సూచించాలని వెల్లడించింది.ఇక కోచ్‌లలో నీటి సదుపాయం ఉందా లేదా అనేది కూడా పరిశీలించాల్సిన బాధ్యత టీటీఈలకే అప్పజెప్పింది. నిర్ణీత సమయానికి కోచ్‌లు క్లీన్ అయ్యేలా చూసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగది ఈ మేరకు రైల్వే బోర్డుకు సూచనలు చేశారు.ఇక ఈ నెలాఖరు కల్లా అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఇక కోచ్‌లను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయాణికుల్లో కూడా అవగాహన తీసుకొస్తామని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఇందుకు సహకరించాలని సురేష్ అంగది వెల్లడించారు.

 
 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways  TTEs  Cleanliness  indian Railways  

Other Articles