Former AP CM Chandrababu Naidu Forced to Abandon Convoy undergo Frisking At Vijayawada చంద్రబాబును ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేసిన సిబ్బంది

Former ap cm chandrababu naidu forced to abandon convoy undergo frisking at vijayawada

TDP, GannavaramAirport, Chandrababu Naidu

Former AP CM Chandrababu Naidu Forced to Abandon Convoy undergo Frisking At Vijayawada

చంద్రబాబును ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేసిన సిబ్బంది

Posted: 06/15/2019 01:46 PM IST
Former ap cm chandrababu naidu forced to abandon convoy undergo frisking at vijayawada

గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు చంద్రబాబు విమానాశ్రయానికి వెళ్లారు. బాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉన్నా.. వెళ్లనివ్వలేదు. దీంతో చంద్రబాబు సామాన్య ప్రయాణికుడిలాగే లోపలికి వెళ్లగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను కూడా తనిఖీ చేశారు. అలాగే ఎయిర్‌పోర్టు లాంజ్‌ నుంచి విమానం వరకు ప్రయాణికులతో కలిసి చంద్రబాబు విమానం దగ్గరకు వెళ్లారు.

వీఐపీ, జెడ్ ప్లస్ భద్రత ఉన్నా చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక వాహనం కేటాయించకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఇలా సామాన్యుడిలా తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోనూ చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్ క్లియరెన్స్ తొలగించారని.. ట్రాఫిక్‌లో బాబు వాహనం ఆగితే భద్రతపరంగా అంత మంచిది కాదని నేతలంటున్నారు.అయితే ఈ తనిఖీల వ్యవహారంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ.. అటు పౌరవిమానయాన శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. అయితే నిబంధనలు ఏం చేబుతున్నాయన్నది తేలాల్సి ఉంది. టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారట.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  GannavaramAirport  Chandrababu Naidu  

Other Articles