Team India Unstoppable 89 Runs Victory Against Pakistan ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను ఏడోసారి చిత్తు చేసిన భారత్‌

Team india unstoppable 89 runs victory against pakistan

Cricket, World Cup 2019, Team India, INDvsPAK

Team India Unstoppable 89 Runs Victory Against Pakistan

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను ఏడోసారి చిత్తు చేసిన భారత్‌

Posted: 06/17/2019 02:30 PM IST
Team india unstoppable 89 runs victory against pakistan

ఆటగాళ్లు మారినా, మైదానాలు మారినా విశ్వ వేదికపై తమను ఓడించే సత్తా పాకిస్తాన్‌కు లేదని భారత్‌ ఆటగాళ్లు మరోసారి నిరూపించారు. మాంచెస్టర్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో తొలుత రోహిత్ శర్మ (140: 113 బంతుల్లో 14x4, 3x6) మెరుపు శతకం బాదడంతో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ని 212/6కే పరిమితం చేసింది. మ్యాచ్‌కి రెండు సార్లు వరుణుడు అడ్డుపడినా.. భారత్ దూకుడు ముందు పాక్ ఏ దశలోనూ నిలవలేకపోయింది. వర్షంతో మ్యాచ్‌ని 40 ఓవర్లకి కుదించిన అంపైర్లు.. పాక్ లక్ష్యాన్ని 302 పరుగులుగా నిర్దేశించగా.. ఆ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్థాన్‌తో ఏడుసార్లు తలపడిన టీమిండియా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి 7-0తో అజేయ రికార్డుని మరింత మెరుగుపర్చుకుంది. తాజా ఓటమితో టోర్నీలో సెమీస్ అవకాశాల్ని పాక్ సంక్లిష్టం చేసుకోగా.. నాలుగో మ్యాచ్‌ ఆడిన భారత్ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర సాగిస్తోంది. మ్యాచ్‌లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ నేతలతో పాటు మరి కొందరు ప్రముఖులు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు.

 
 

 

 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  World Cup 2019  Team India  

Other Articles