వారం రోజులుగా నగరవాసులతో పాటు తెలుగురాష్ట్రాల ప్రజలను తీవ్ర అందోళనకు గురిచేసిన హయత్‌నగర్ కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ నెల 23న కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకీ వారం రోజుల తర్వాత మంగళవారం లభ్యమైన విషయం తెలిసిందే. అమెను మౌని అనే మరో యువతి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో గుర్తించి పోలీసులతో పాటు తమ కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికిన మోస్ట్ వాంటెడ్ ఘరానా మోసగాడు రవిశేఖర్ ఆమెను కారులో అపహరించుకుని తీసుకెళ్లాడని ఇప్పటివరకు అందరూ భావించారు. పోలీసులు సైతం ఇదే కోణంలో కేసును దర్యాప్తు చేశారు. ఇక రవిశేఖర్ తల్లి సైతం అమాయకురాలైన ఓ అడబిడ్డనుని కిడ్నాప్ చేసిన తన కొడుకు రవిశేఖర్ ను చంపేయండని కూడా అన అవేదనను వెల్లగక్కింది. ఇలాంటి తరుణంలో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
సోని ఎంజీబీఎస్ లోని దేవరకొండ ఫ్లాట్ ఫాం వద్ద ప్రత్యక్షమైంది. బాధితురాలిని గుర్తుపట్టిన స్నేహితురాలు.. మీడియాలో వస్తున్న వార్తల గురించి చెప్పి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావని ప్రశ్నించింది. దీనికి ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీంతో ఆమె బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడించింది. విషయాన్ని వారు పోలీసులకు చెప్పడంతో అందరూ కలిసి ఎంజీబీఎస్‌కు చేరుకుని ఆమెను తీసుకెళ్లారు.
సోనిని విచారించిన పోలీసులు సాయంత్రం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కాగా, కిడ్నాప్ చెరలో వారం రోజులు ఉన్న ఆమె.. తనను అతడు కిడ్నాప్ చేశాడన్న విషయాన్ని తెలుసుకోలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారం రోజులుగా ఆమె అతడి వెంట ఉన్నప్పటికీ తల్లిదండ్రులతో ఒక్కసారి కూడా మాట్లాడించకుండా నిందితుడు రవిశేఖర్ ఎలా మేనేజ్ చేశాడన్న విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదు. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి బాధిత యువతి బస్సులో ఎంజీబీఎస్ బస్టాండుకు చేరుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more