పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి యువతిని నమ్మించిన అనంతరం అమెను కిడ్రాప్ చేసి వారం రోజుల హైడ్రామాకు తెరతీసిన తరువాత.. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో చేసేదిలేక యువతిని అద్దంకిలో వదిలేసిన నిందితుడు.. ఒంగోలుకు చేరుకుని తలదాచుకునే ప్రయత్నం చేయగా.. తెలంగాణ పోలీసుల సమాచారం మేరకు అక్కడి పోలీసులు రవిశేఖర్ ను అరెస్టుచేశారు. దీంతో సోని కిడ్నాప్ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.
క్రితం రోజు రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలో సోనీని కిడ్నాపర్ విడిచిపెట్టగా, ఆమె హైదరాబాద్ చేరుకుని హయత్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే, ఆ సమాచారాన్ని ప్రకాశం జిల్లా పోలీసులకు చేరవేశారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం కాగా, ఒంగోలు శివార్లలో రవిశేఖర్ ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం రవిశేఖర్ హయత్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
కాగా, సోనీని ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని నడిరోడ్డుపై విడిచిపెట్టిన రవిశేఖర్, అక్కడి నుంచి క్షణాల్లో మాయం కాగా, దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై ఉన్న సోనీ, బస్సులో హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకోగా, మౌని అనే మరో యువతి ఆమెను గుర్తించి ఆదుకుంది. వారం రోజులుగా సరైన తిండి, నిద్ర, విశ్రాంతి లేని స్థితిలో, కళ్లు పీక్కుపోయి, బలహీనంగా కనిపిస్తున్న సోనీని చూసిన స్థానిక యువతి మౌని, ఆమె దగ్గరకు వచ్చి, గుర్తించి, పలకరించి, యోగక్షేమాలు అడిగింది.
మౌనీయే తన ఫోన్ ను సోనీకి ఇచ్చి, తండ్రికి, పోలీసులకు ఫోన్ చేయించింది. ఆమెను క్షేమంగా తండ్రికి, పోలీసులకు అప్పగించే వరకూ అక్కడే ఉంది. ఆపై మీడియాతో మాట్లాడిన మౌనీ, తాను ఎంజీబీఎస్, 70వ నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సోనీని గుర్తించానని తెలిపింది. వెళ్లి పలకరించానని, ఎక్కడికి వెళ్లావని అడిగితే, తిరుపతికి తీసుకెళ్లాడని, ఇంకా ఎక్కడ తిప్పాడో గుర్తు లేదని చెప్పినట్టు పేర్కొంది. ఆపై పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లారని, అప్పటివరకూ తాను సోనీకి తోడుగా ఉన్నానని చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more