ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు.. ప్రస్తతం అదే ఉగ్రవాద సంస్థ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన హామ్జా బిన్ లాడెన్ ను అగ్రరాజ్య అమెరికా తుదముట్టించిందా.? అంటే ఔనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే అగ్రరాజ్యం కానీ, లేక అదేశానికి చెందిన అధికారులు కానీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కాగా హామ్జా బిన్ లాడెన్ మరణానికి సంబంధించిన పక్కా సమాచారం తమ వద్ద వుందని ఎన్బీసీ వార్త సంస్థ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.
హామ్జా బిన్ లాడెన్ అల్ ఖైదా ఛీప్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత అతని కోసం రెండేళ్లుగా గాలిస్తున్న అమెరికా ఎట్టకేలకు విజయం సాధించింది. అతడిని హతమార్చినట్టు అమెరికా పత్రికలు ప్రకటించాయి. హమ్జా మృతిని అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించినట్టు తెలిపింది. కాగా, గత ఏడాది తమ అధికారిక మీడియా అర్మ్ ద్వారా సౌదీ అరేబియాను హామ్జా బెదిరించాడు. అరేబియావాసులు స్థానిక ప్రభుత్వంపై తిరుగబాటు చేయాలని కూడా పిలుపునిచ్చాడు. ఇదే హమ్జా చివరి అధికారిక ప్రకటన.
2017లో హమ్జా బిన్ లాడెన్ ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా అతడిపై మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. కాగా, అమెరికా మీడియా మొత్తం హమ్జా మృతిపై కోడై కూస్తుండగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని చెప్పడం గమనార్హం. ఇక అగ్రరాజ్యంలో ట్విన్ టవర్లను కూల్చిన తరువాత పాకిస్థాన్ లోని అబోట్టాబద్ లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్ ను 2011లో అగ్రరాజ్యం అమెరికాకు చెందిన నేవి పకడ్భందీ ప్రణాళికతో మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more