Judgementall Hai Kya Director Prakash Kovelamudi & writer Kanika Dhillon Officially Split ‘అవును..మేమిద్దరం విడిపోయాం’

Judgementall hai kya director prakash kovelamudi writer kanika dhillon officially split

Kanika Dhillon, Prakash Kovelamudi

Judgementall Hai Kya Director Prakash Kovelamudi & writer Kanika Dhillon Officially Split

‘అవును..మేమిద్దరం విడిపోయాం’

Posted: 08/02/2019 03:44 PM IST
Judgementall hai kya director prakash kovelamudi writer kanika dhillon officially split

(Image source from: indiatoday.in)

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాశ్‌ కోవెల మూడి, కోడలు కనికా దిల్లాన్‌ రెండేళ్ల క్రితమే విడిపోయామని వెల్లడించారు. తాజాగా వీరిద్దరూ కంగనా రనౌత్‌ నటిచించిన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ చిత్రానికి కలిసి పనిచేశారు. ఈ సినిమాకు ప్రకాశ్ దర్శకత్వం వహించగా..కనిక రచయితగా ఉన్నారు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కనిక తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. ఈ విషయం గురించి ప్రకాశ్‌ కోవెలమూడి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యాను. కనికా మాత్రం రెండేళ్ల క్రితమే ముంబై షిప్ట్‌ అయ్యింది’ అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై కనికా ఎక్కువగా స్పందించలేదని తెలుస్తోంది. ‘విడిపోయారు కదా.. కలిసి పని చేస్తారా’ అని విలేకరులు ఆమెను ప్రశ్నించగా.. ‘తప్పకుండా. జడ్జిమెంటల్‌ హై క్యా సినిమా కోసం కలిసి పని చేశాం.. విజయం కూడా సాధించాం కదా. తప్పకుండా మరో ప్రాజెక్ట్‌ కోసం కలిసి పని చేస్తామని’ కనికా పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో వీరిద్దరి నుంచి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా కంగనా రనౌత్, రాజ్‌కుమార్‌ రావు ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి  ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహించగా, కనికా కథా సహకారం అందించారు. వీరిద్దరూ 2014లో వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanika Dhillon  Prakash Kovelamudi  

Other Articles