దేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాలన్నీ దోపిడీదారులకు అడ్డాలు అన్న వాదన భక్తులలో బలంగా నాటుకుపోతుంది. పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే.. దారి ఖర్చులను ఇచ్చి మరీ ప్రోత్సహించిన గ్రామపెద్దలు, తోటి గ్రామస్థుల సంఖ్య క్రమంగా కనుమరుగైంది. దీనికి బదులుగా దోపిడీదారులు సంఖ్య గణనీయంగా పెరిగింది. రూపాయి వస్తువును పది రూపాయలుగా చెప్పి.. చివరకు దానిని ఏడుకో, ఎనమిదికో అంటగట్టే వ్యాపారుల సంఖ్య పెరిగింది.
అది డబ్బులున్నవారికే అనుకుందామా..? అలాంటి పరస్థితి లేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకున్న తరువాత దారిపోడువునా వున్న దుకాణాల వైపు చూసి చిన్నారులు అడుగు కూడా ముందుకు వేయరు. మాకు అది కావాలంటే.. కాదు అదని మారం చేయడం.. చివరకు తల్లిదండ్రులు వాటి ధర తెలుసుకుని బేరమాడి చివరకు ఎంతకో దానిని కొనుగోలు చేయడం పుణ్యక్షేత్రాలలో పరిపాటి అని చెప్పక తప్పదు. ఇది వస్తువులకే పరిమితం కాదు.. అల్పాహారం మొదలుకుని బోజనం వరకు అన్ని చోట్ల ధరాఘాతం ప్రళయతాండవం చేస్తోంది.
అయితే ఈ తరహా దోపిడీలకు ప్రసిద్ద చెందిన పుణ్యక్షేత్రాలు నెలవు కావడం.. అనేక పిర్యాదులు వెల్లువెత్తినా.. తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం తప్ప నిజంగా చిత్తశుద్దితో చర్యలు చేపట్టిన అధికారులు మాత్రం కానరాలేదు. మరీ ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు కొలువైన తిరుమల కొండపై ఈ తరహా ఘటనలు అనేకం. అయితే ఇన్నాళ్లు అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోని ఈ సమస్యను, రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. తిరుమలపై నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆలయ కమిటీ భక్తులను నిలువుదోపిడి చేస్తున్నఅల్పాహారం, భోజన హోటళ్లపై చెక్ పెట్టాయి.
తిరుమల కొండపై ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేయడంతో పాటు.. ఆ భోజన పలహారాలు కూడా నాసి రకంగా వుండటంపై దేవాదాయశాఖ కన్నెర చేసింది. ఇకపై వీటి ధరలను రూ.7.50, రూ.22.50గా నిర్ణయించింది. ఫుల్ మీల్స్‌కు రూ.31గా తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొండపై 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 30 చిరు దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎవరైనా నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తే టోల్‌ఫ్రీ నంబరు 18004254141కి ఫోన్ చేయాలని ఏపీ ఎండోమెంట్స్ విభాగం తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more