బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) ఇకలేరు. యావత్ భారతావనిని శోకసంద్రంలో ముంచుతూ గుండెపోటుతో ఆమె హఠాన్మరణం చెందారు. మంగళవారం (ఆగస్టు 6) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. గుండెపోటుకు గురైన కొద్ది క్షణాలకే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది.
సుష్మా స్వరాజ్ మరణవార్తతో బీజేపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. హోంమంత్రి అమిత్ షా, మంత్రలు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్.. ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన సుష్మా స్వరాజ్ 25 ఏళ్ల వయసులోనే హర్యాణా కేబినెట్లో మంత్రి పదవిని చేపట్టారు. పిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
సుష్మా స్వరాజ్ సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ పనిచేశారు. ఆమె భర్త కౌశల్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో సుష్మాస్వరాజ్ 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో మంత్రిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
పాకిస్థాన్‌లోనూ సుష్మాకు అభిమానులు..
తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్ ప్రాంతాలకతీతంగా.. ఆ మాటకొస్తే దేశాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన చాలా మంది పౌరుల సమస్యలను పరిష్కరించి దాయాది దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నారు.2009 నుంచి 2014 వరకు 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా బాధ్యతలు నిర్వహించారు.
ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగానూ సుష్మా పనిచేశారు. షీలా దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు. 1998 అక్టోబర్ 13 నుంచి డిసెంబరు 3 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలలో జన్మించిన సుష్మా స్వరాజ్.. 1970లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏబీవీపీలో యాక్టివ్ మెంబర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సుష్మా స్వరాజ్.. అతి తక్కువ కాలంలోనే ఉన్నత పదవులను అధిరోహించారు.
#WATCH Prime Minister Narendra Modi pays last respects to former External Affairs Minister and BJP leader #SushmaSwaraj. pic.twitter.com/Sv02MtoSiH
— ANI (@ANI) August 7, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more