Amit Shah's fiery speech on Kashmir in Lok Sabha లోక్ సభలో అమిత్ షా భావోద్వేగ ప్రసంగం..

Jaan de denge iske liye amit shah s fiery speech on kashmir in lok sabha

Jammu and Kashmir, J&K statehood, Jammu Kahmir UT, Amit Shah on jammu and kashmit, amit shah on JK, amit shah on jk union territory, amit shah on JK statehood, amit shah on article 370, amit shah sensational comments, lok Sabha, Politics

Amit Shah delivered a fiery speech as he moved a resolution revoking Article 370 in the Lok Sabha. The Rajya Sabha gave nod to the bill that scrapped Article 370 of the Constitution that gave special status to Jammu and Kashmir.

ప్రాణత్యాగానికైనా రెడీ: లోక్ సభలో అమిత్ షా భావోద్వేగ ప్రసంగం..

Posted: 08/06/2019 04:33 PM IST
Jaan de denge iske liye amit shah s fiery speech on kashmir in lok sabha

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు సహా ఆర్టికల్ 370, 35A రద్దుకు రాజ్యసభలో ఆమోదం లభించిన నేపథ్యంలో ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుతో పాటు రాజ్యసభలో సభ్యుల అమోదం పోందిన నాలుగు బిల్లులను లోక్ సభలో పెట్టారు. ఈ సందర్భంగా తనను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పై మండిపడుతూ, అమిత్ షా ఉద్వేగ పూరిత ప్రసంగాన్ని చేశారు. కాశ్మీర్ భారత భూబాగంలో అంతర్భాగమని.. అది అలా వుండేందుకు అవసరమైతే తన ప్రాణత్యాగానికైనా సిద్దమని అన్నారు.

కశ్మీర్ లో ప్రజలు దశాబ్దాల తరబడి అన్యాయానికి గురవుతుంటే, ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వారిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కశ్మీర్ లో ఉద్రిక్తతలకు కారణం కాంగ్రెస్ వైఖరేనని మండిపడ్డారు. కాశ్మీర్ ను పాలించిన మూడు కుటుంబాలు ఎంతో ఉన్నతిని సాధించాయని కానీ, కాశ్మీర్ ప్రజలు మాత్రం ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదని అన్నారు. కశ్మీర్ కోసం తాను ప్రాణాలైనా అర్పిస్తానని, రాష్ట్రంలోని ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని

ఇప్పటికే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సైతం బిల్లు పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని, లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తే, ప్రజలు హర్షిస్తారని అన్నారు. ఈ బిల్లు అమలైతే కశ్మీర్ వాసులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని అమిత్ షా గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్ కు ఏ మాత్రం సంబంధం లేదని, ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంగా ఉన్న పీఓకే సైతం భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  J&K statehood  Jammu Kahmir UT  Amit Shah  Lok Sabha  Politics  

Other Articles