తమిళనాడులో ఘోర రోడ్డప్రమాదం సంభవించింది. గూడ్స్ కారియర్ అటోలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో టైరు పేలడంతో ఈ దుర్ఘటన సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆటో టైరు పేలడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బ్యారికేడ్ ను ఢీకొని ఏకంగా 60 అడుగుల లోతున్న బావిలో పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరుచ్చి-తిరువాయూర్ రోడ్డుపై ఉప్పిల్లపురం గ్రామశివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, 9 మంది క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రితం రోజు మధ్యాహ్నం ముసిరి ప్రాంతానికి చేరువలోని పెరూర్ గ్రామానికి చెందిన 17 మందితో ఎస్.ఎన్ పూడుర్ గ్రామానికి బయలుదేరి వెళ్లిరు. మార్గ మధ్యంలో అటో టైరు పేలడంతో అటో ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో వాహనంపై అటో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
అటో రోడ్డు పక్కనున్న బ్యారికేడ్ ను ఢీకొని.. రోడ్డ పక్కనున్న బావిలో పడింది. దీంతో అటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మహిళలతో పాటు ముగ్గరు చిన్నారులు కూడా వున్నారని పోలీసులు తెలిపారు. బావి లోతుగా ఉండడంతో అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టైరు పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more