నిండు ఆకాశమంత మనస్సు ఉన్న రాజువయ్యా.. పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేణువయ్యా.. ఈ పాట చిన్నరాయుడు చిత్రంలోనిదే.. కానీ అక్షరాల సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం నూటికి నూరుశాతం నిజమనే చెప్పాలి. ఆయన తన సుదీర్ఘ సినీ కెరీర్ లో తీసినవి చాలా తక్కువ చిత్రాలే అయినా.. ఆయనకున్న అభిమానగణం మాత్రం ఎంతో ఎక్కువ. వరుసగా పలు చిత్రాలు బాక్సాఫిసు వద్ద సవ్వడి చేయలేకపోయినా.. ఆయన అభిమానుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది తప్ప.. తగ్గలేదు.
ఇది కేవలం ఆయనలోని నటుడ్ని చూసి మాత్రమే కాదు.. ఆయన గుణగణాలను, ఆయనలో మానవత్వం.. స్పందించే హృదయం కోట్లాది మందిని ఆయన అభిమానులుగా మార్చింది. సముద్రమంత సమూహంలా ఆయన అభిమానగణం వున్నారంటే అది దైవసంకల్పమే. తాజాగా కేన్సర్‌తో బాధపడుతున్న అభిమాని కోరిక తీర్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అభిమానిని కలిసి ధైర్యం చెప్పి.. జనసేన పార్టీ తరపున తన చేతులు మీదుగా ఆర్థిక సాయం అందజేశారు.. జనసేన పార్టీ అండటా ఉంటుందని భరోసా నింపారు. అభిమాని ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీసి.. వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు..
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం, అన్నసముద్రానికి చెందిన బుడిగయ్య పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న అతడు.. కీమో థెరపీ తీసుకుంటూ జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఓసారి చూడాలని.. తన మనసులో కోరికను స్థానిక జనసేన నేతలకు చెప్పాడు. నేతలు విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లడంతో.. బుడిగయ్యను పరామర్శించేందుకు అన్నసముద్రం వస్తానని చెప్పారు.
ఈలోపే బుడిగయ్యను అంబులెన్స్ లో హైదరాబాద్ లో ఉన్న ప్రశాసన్ నగర్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అతడ్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు.. అభిమాని భార్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో ఎన్.ఆర్.ఐ ఆస్పత్రి వైద్యులతో తాను స్వయంగా మాట్లాడుతానని చెప్పిన జనసేనాని.. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని యర్రగొండపాలెం జనసేన పార్టీ ఇంఛార్జ్ డా.గౌతమ్ కు సూచించారు.
JanaSena Chief @PawanKalyan fulfilled activist wish & provided 1 Lakh financial assistance.
— JanaSena Party (@JanaSenaParty) August 20, 2019
Video : https://t.co/rc1TQ9u6dw pic.twitter.com/jdPeEk5fSd
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more