దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులా? అయితే మీరు ఎస్బీఐ మిమల్ని ఉపేక్షించింది. అదెలా అంటారా.. మీ బ్యాంకులోని ఖాతాలో నిల్వ వున్న డబ్బుపై లభించే వడ్డీ రేటును యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతాలోని సోమ్ముకు ప్రస్తుతం లభిస్తున్న లక్ష రూపాయలకు సాలీనా 3.5శాతం వడ్డీ లభిస్తోంది. లక్ష రూపాయలకు పైబడి వున్న మొత్తనాకి ఏడాదికి మూడు శాతం వడ్డీని అందించనుంది.
ఇదిలావుండగా ఫిక్స్ డ్ డిపాజిట్లపై మాత్రం ఎస్బీఐ కొరడాను ఝుళింపించింది. ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు మూడవ ద్వైమాస ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో రెపో రేటును 5.75 నుంచి 5.40కి మార్చుతూ 35 పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఫిక్స్ డ్ డిపాజిట్ల్ లపై వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించింది. ఇక తగ్గిన వడ్డీ రేట్ల వివరాలు ఇలా వున్నాయి.
ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు:
7 నుంచి 45 రోజుల వరకు 5 శాతం నుంచి 4.5 సవరించింది
46 రోజుల నుండి 179 రోజుల వరకు- 5.50%
180 రోజుల నుండి 210 రోజులు -6.00%
211 రోజుల నుండి 1 సంవత్సరం -6.00% కన్నా తక్కువ
1 సంవత్సరం మరియు 3 సంవత్సరాల మధ్య పరిపక్వత కోసం సాధారణ ప్రజలకు ఎస్బిఐ తాజా ఎఫ్డి రేట్లు (crore 2 కోట్ల కంటే తక్కువ)
1 సంవత్సరం నుండి 2 సంవత్సరం -6.70% కన్నా తక్కువ
2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కన్నా తక్కువ -6.50%
3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య పరిపక్వత కోసం సాధారణ ప్రజలకు ఎస్బిఐ తాజా ఎఫ్డి రేట్లు (crore 2 కోట్ల కంటే తక్కువ)
3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కన్నా తక్కువ -6.25%
5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు -6.25%
నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తుంటారా? అయితే బ్యాంక్ సరికొత్తగా ఆవిష్కరించిన ఈ ఫీచర్ గురించి తప్పక తెలుసుకోండి. నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే వారి కోసం బ్యాంక్ లాక్ అండ్ అన్‌లాక్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ద్వారా మీ నెట్ బ్యాంక్ ఖాతాను లాక్ చేసుకుంటే పొరపాటున ఎవరికైనా పాస్వర్డ్ తెలిసినా ఖాతా నిర్వహణ సాధ్యంకాదన్నమాట.
వివరాల్లోకి వెళితే...ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని బ్యాంక్ ఖాతాను నిర్వహించుకునే సదుపాయం నెట్ బ్యాంకింగ్ ద్వారా లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే పొరపాటు మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా, వాటి చోరీ జరిగినా కొంపకొల్లేరు కావడం ఖాయం. ఈ సమస్య లేకుండా ఖాతాదారులు తమకు నచ్చినప్పుడు నెట్‌బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఈ లాక్ అండ్ అన్‌లాక్ సదుపాయం అక్కరకు వస్తుంది. కాకపోతే ఈ సదుపాయం వ్యక్తిగత ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఖాతాదారులు చేయాల్సింది ఇదే.
* బ్యాంక్ వెబ్సైట్ www.onlinesbi.comకు వెళ్లి లాక్ అండ్ అన్ లాక్ యూజర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది.
* డ్రాప్‌డౌన్ మెనూలో లాక్ యూజర్ యాక్సెస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* అందులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, అకౌంట్ నంబర్, క్యాప్చా తదితర వివరాలు ఎంటర్ చేయాలి.
* పాపప్ విండో ఓపెన్ అయి మూడు పాయింట్లు కనిపిస్తాయి. వాటిని చదివి ఓకే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్ అవుతుంది.
* తిరిగి అకౌంట్‌ను అన్‌లాక్ చేయాలనుకుంటే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఇదే ప్రాసెస్ ను ఫాలో కావాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more