ఉన్నత విద్యాను అభ్యసించడానికి లండన్ కు వెళ్లిన తెలుగు విద్యార్థి సన్నే శ్రీ హర్ష అదృశ్యమయ్యాడన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ విద్యార్థి అదృశ్యం కావడంపై బీజేపి నేతలు కూడ కలవరపడుతున్నారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఉదయ్ ప్రతాప్ కుమారుడైన శ్రీహర్ష లండన్ లో పీజీ చదువుతున్నారు. రెండ్రోజులుగా శ్రీహర్ష నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు అతడి స్నేహితులను సంప్రదించారు.
దీంతో వారు స్థానిక పోలీసులను సంప్రదించగా యువకుడి కోసం గాలింపు చేపట్టారు. లండన్ లోని బీచ్హెడ్డి అనే బీచ్ సమీపంలో శ్రీహర్షకు సంబంధించి ల్యాప్ టాప్ ను గుర్తించారు. దీంతో బీచ్ పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. లండన్ లోని పోలీసులు ఖమ్మంలోని హర్ష కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అందోళనకు గురైన హర్ష తల్లిదండ్రులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు.
కాగా, శ్రీహర్ష ‘‘హ్యాండోవర్ మై బిలాంగింగ్స్ టు పేరెంట్స్’’ అని ఒక చిన్న సందేశం రాసినట్లు తెలుస్తోంది. దీంతో రెండు హెలికాప్టర్ల సహాయంతో బీచ్ ప్రాంతంలో పోలీసులు గాలిస్తున్నారు. మిస్సింగ్ సమాచారం తెలియగానే బంధువులు, స్థానిక రాజకీయ నేతలు వారి కుటుంబాన్ని పరామర్శించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు... ఫోన్లో హర్ష తండ్రి ప్రతాప్ తోపాటు వారి బంధువులతో మాట్లాడారు. హర్ష ఆచూకీ కనుగొనడానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కేంద్రం ఈ విషయంపై ఆరా తీస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more