తమ మానాన తాము పనులు చేసుకుపోతున్న యువకులపై కన్నెపిల్లలతో ముచ్చట్లు.. డేటింగ్, దీంతో పాటు ఇంకా ఎన్నె ఎన్నోన్నో అంటూ స్మార్ట్ ఫోన్లకు సందేశాలు, ఈమెయిల్ అకౌంట్లకు మెయిల్ సందేశాలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలుగా ప్రచారం చేయవచ్చో అన్ని మార్గాల్లో దేశవ్యాప్తంగా ప్రచారం చేసి.. వల విసురుతారు. నెలకు కేవలం రూ. 1,025 మాత్రమే. వారితో కావాలంటే మాట్లాడండి. వారు ఇష్టపడితే డేటింగ్ కు వెళ్లండి. ఎంత కాలానికైనా ప్యాకేజీలున్నాయి.. అంటూ మాయమాటలతో యువతపై మాటువేసిన మాయలాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోల్ కతా కేంద్రంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సోమా సర్కార్ ముఠాకు సంబంధించి..పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.. సోమా సర్కార్ అనే మాయలాడి పశ్చిమ బెంగాల్ కు చెందిన అంబాసుర్, ఇమ్రాన్ లను కలుపుకుని దేశవ్యాప్తంగా అమ్మాయిలు అంటే వీక్ నెస్ వున్న యువకులను టార్గెట్ గా చేసుకుని వారిని నిట్టనిలువునా ముంచేందుకు పథకాన్ని రచించింది. అందుకు ఆమె చేసిందల్లా 'లవ్ ఆర్ట్ డేటింగ్' పేరిట వెబ్ సైట్ తెరవడమే. ఈ వైబ్ సైట్ ముసుగులో రెండేళ్ల నుంచి యువకుల నుంచి అప్పనంగా డబ్బును లాగేస్తోంది.
అదెలా అంటే.. ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి, 20 మంది అమ్మాయిలను నియమించుకుని, వారితో దందా సాగించింది. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 1,025, ఆపై ప్యాకేజీల ఆధారంగా రూ. 18,000 వరకూ తీసుకుంది. కేవలం మాటలతో సరిపెట్టుకుంటామంటే, ఓ అమ్మాయి రోజుకు గంట పాటు కబుర్లు చెబుతుంది. ఇక డేటింగ్ కావాలంటే, మరింత డబ్బు తీసుకుని అమ్మాయిల ఫోటోలు, వివరాలు అంటూ చూపిస్తారు. ఆపై సోమా కాల్ సెంటర్ లో పనిచేసే అమ్మాయిలే, అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండేవారు. డేటింగ్ చేద్దామని ఆశపడే అబ్బాయిలే వీరి టార్గెట్.
వారి ఫోటోలు, అడ్రస్, ఫోన్ నంబర్లు సేకరించే ఈ టీమ్, ఇతర డేటింగ్ సైట్లలో వాటిని ఉంచి పరువు తీసేది. ఆపై బ్లాక్ మెయిల్ కు దిగుతారు. మీ ఫొటోలు ఫలానా వెబ్ సైట్ లో ఉన్నాయని, అనైతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నందున కోల్ కతాలో కేసు నమోదైందని బెదిరిస్తారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు డబ్బు కట్టాలని చెప్పి, వారి నుంచి డబ్బు వసూలు చేస్తారు. ఇలా ఎంతో మందిని నమ్మించి దాదాపు రూ. 8 కోట్లు వసూలు చేశారు. వీరి చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో, కేసును నమోదు చేసి విచారించిన స్పెషల్ టీమ్, కోల్ కతాకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని, వారిని హైదరాబాద్ కు తరలించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more