Aspiring TV actress commits suicide in Mumbai అపార్టుమెంటుపై నుంచి దూకి సినీనటి ఆత్మహత్య

Mumbai based actress jumps to death from oshiwara apartment terrace

pearl punjabi, pearl punjabi suicide, mumbai actor suicide, mumbai tv actor suicide, mumbai news, mumbai crime news, mumbai latest news

An aspiring actor allegedly committed suicide by jumping off her apartment in Mumbai’s Oshiwara area late on Thursday. The deceased has been identified as Pearl Punjabi.

అవకాశాలు రాక తనవు చాలించిన సినీనటి

Posted: 08/30/2019 04:44 PM IST
Mumbai based actress jumps to death from oshiwara apartment terrace

సినిమాల్లో నటించేందుకు ముంబయికి వచ్చిన పర్ల్ పంజాబీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.. ఆ అవకాశాలు అందని ద్రాక్షాలా మారడంతో తీవ్ర మానసిక అందోళనకు గురై బలవన్మరణానికి పాల్పడింది. దీనికి తోడు అమెను ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడాయి. దీంతో గత (గురువారం) అర్థరాత్రి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన గురించి అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డ్ బిపిన్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ గురువారం అర్థరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పాడు. తనకు రోడ్డుపై ఎవరో అరుస్తున్నట్లుగా అనిపించిందని.. ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్లానని చెప్పాడు. తాను తిరిగి వచ్చేసరికి అపార్ట్ మెంట్లోని మూడో అంతస్తు నుంచి అరుపులు వినిపించాయని దీంతో తాను పైకి వెళ్లేసరికి ఆ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు.

తాను అన్వేషిస్తున్న సినీ అవకాశాలు రాకపోవడంతో పర్ల్ పంజాబీ మానసికంగా డిస్టర్బ్ అయివున్నారని పోలీసులు తెలిపారు. దీంతో అమె తన తల్లితో నిత్యం గొడవ పడేదని పోలీసులు తెలిపారు. గతంలోనూ రెండు మూడు పర్యాయాలు అమె బలవన్మరణానికి పాల్పడ్డారని, అయితే సకాలంలో అమెను కుటుంబసభ్యులు రక్షించి అసుపత్రికి తరలించారని దీంతో అమె బతికారని పోలీసులు పేర్కొన్నారు. పర్ల్ పంజాబీ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pearl punjabi  cine actress  suicide  mumbai actress  suicide  crime  mumbai latest news  

Other Articles