చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమా చేసినా ఆ నటులకు కొంత ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఇక అందులో మూడు నాలుగు చిత్రాలు చేసినవారైతే.. ఇక వారికి స్టార్ స్టేటస్ వచ్చేసినట్టే. అయితే అవే నాలుగు చిత్రాలు ప్లాప్ అయితే.. ఇక వారి గురించి ఏందుకు అడుగుతారు. వారినెవరు గుర్తుపడతారనేగా మీ డౌట్. అయితే వారిని గుర్తుపట్టినా తప్పే. వారిని తదేకంగా చూసినా కోపమే. అదే కోపం కట్టలు తెంచుకుంది. అంతే ఒక వ్యక్తి చెంప చెల్లుమనిపించాడు ఆ నటుడు. అంతేకాదు అతని కారును ధ్వంసం చేశాడు కూడా. అప్పటికీ అతని కోపం చల్లారకపోవడంతో.. కారు డోరును కూడా తొలగించే ప్రయత్నం చేశాడు.
అంతే ఏదో జరుగుతుందని గుమ్మిగూడిన స్థానికులు వచ్చి సముదాయించారు.. వారించారు.. అయినా వినకపోవడంతో.. నటుడిని చావచితకకొట్టారు. ఇది కర్నాటకలో జరిగిన ఘటన. హుచ్చా వెంకట్ అంటే ఎంతో గుర్తింపు ఉన్న నటుడు, దర్శకుడు, నిర్మాత. 2005లో వచ్చిన 'మెంటల్ మాంజా' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. పలు చిత్రాల్లో నటించడమే కాదు, దర్శకత్వం కూడా వహించాడు. కొన్ని చిత్రాలకు నిర్మాత కూడా వ్యవహరించాడు. కన్నడ బిగ్ బాస్-3లోనూ పాల్గొన్నాడు. అయితే, కాంట్రవర్సీలకు ముద్దుబిడ్డగా మారిన ఈయనకు తాజాగా వినూత్న అనుభవం ఎదురైయ్యింది.
తన ప్రవర్తన ఎలాంటిదో సినిమాల్లో చూపించలేకపోయిన ఈ నటుడికి కన్నడ బిగ్ బాస్ షో ద్వారా మాత్రం చూపించే అవకాశం లభించింది. ఈ షోలోని తోటి కంటెస్టంట్లతో ఆయన వ్యవహరించిన తీరు గంధరగోళంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆతడ్ని ఈ షోలో అనుమతించినందుకు హోస్ట్ గా వ్యవహరించిన సుదీప్ టీవీ ఛానెల్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు, ఇక అంతకుముందు ఆయన ఏకంగా నటి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదగిన రమ్య అలియాస్ దివ్య స్పందనను పెళ్లి చేసుకున్నానని కూడా వ్యాఖ్యలు చేసాడు. దీనిపై అమె పెట్టిన కేసు విచారణ జరుగుతోంది.
ఇలా అనేక వివాదాలతో బ్యాడ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హుచ్చా వెంకట్ మరోసారి అదే రీతిలో హంగామా చేయడమే కాదు, ఈసారి స్థానికుల చేతిలో తన్నులు కూడా తిన్నాడు. కర్ణాటకలోని కొడగులో హుచ్చా వెంకట్ ఓ హోటల్ కు వెళ్లాడు. అయితే సినీ నటుడు కావడంతో దిలిప్ అనే వ్యక్తి అతడ్ని తదేకంగా చూశాడు. ఎంటీ అలా చూస్తున్నావ్.. నీ పని నువ్వు చేసుకో.. అంటూ వారించాడు. అయినా దిలిప్ అతడ్నే చూస్తుండిపోయాడు. దీంతో వెంకట్ ‘‘నేనెవరో తెలుసా’’ అంటూ ప్రశ్నించాడు. ఓ బాగా తెలుసు మీరు హుచ్ఛా వెంకట్ కదా అని బదులిచ్చాడు.
సాధారణంగానే దిలిప్ ఇచ్చిన బదులుతో తనను ఏకవచనంతో సంబోధిస్తాడా అంటూ దిలిప్ చెంపను చెల్లుమనిపించాడు వెంకట్. అంతటితో ఆగకుండా అతనికి చెందిన కారును కూడా ధ్వంసం చేశారు. స్థానికులు గుమ్మిగూడి అలా చేయవద్దని వారించారు. అయినా వినకుండా ఇష్టంవచ్చినట్టు వ్యవహరించాడు. వింతగా ప్రవర్తించాడు. అంతే గుమ్మిగూడిన జనాలపైకి కూడా వెళ్లాడు. ఇంకేముందు జనాలకు కొపాన్ని చవిచూసి వారి చేతిలో దెబ్బలు తిన్నాడు. అయినప్పటికీ హుచ్చా వెంకట్ విచిత్రంగా ప్రవర్తిస్తూ మీడియా కెమెరాల కంట్లో పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సినీ నటుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more