ప్రధాని నరేంద్రమోదీని 'కమాండర్ ఇన్ థీఫ్'గా సంబోధించిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ముంబయిలోని గిర్గావ్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 3వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రఫేల్ ఒప్పందంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య మాట తూటాలు పేలిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్నే రాహుల్ ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నారు.
పలు ఎన్నికల సభల్లో ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ మోదీపై విమర్శలు కురిపించారు. అదే విధంగా గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీని 'కమాండర్ ఇన్ థీఫ్' గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత మహేష్ శ్రీమాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ‘ఆయన వ్యాఖ్యలు ఒక్క ప్రధానినే కాదు, భాజపా కార్యకర్తలందరినీ అవమానించినట్లు ఉన్నాయి. గతంలో కూడా రాహుల్ ‘కాపలాదారుడే దొంగ’ అని మోదీని పదేపదే విమర్శిస్తూ అగౌరవ పరిచారు’ అంటూ తన పిటిషన్లో కోర్టుకు తెలియజేశారు.
ముంబయిలోని గిర్గావ్ మెట్రోపాలిటన్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అయితే గత సంవత్సరం సెప్టెంబరులో పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ 'కమాండర్ ఇన్ థీఫ్' అని సంబోధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నేత మహేశ్ శ్రీమాల్ పరువు నష్టం దావా వేశారు. కేవలం ప్రధానినే కాకుండా బిజెపి కార్యకర్తలందరినీ రాహుల్ అ గౌరవపరిచారని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే పలు సందర్భాల్లో 'కాపలాదారుడే దొంగ' అని మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల్ని కూడా పిటిషనర్ ప్రస్తావించారు. కాగా ఈ నేపథ్యంలో దాఖలైన పరువు నష్టం దావా కేసులో ఆయనకు సమన్లు పంపారు. అక్టోబరు 3న వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more