DMK Satlin sensational comments on modi govt ఆర్ధిక మాంద్యం నుంచి ప్రజల దృష్టిమరల్చుతున్న కేంద్రం: స్టాలిన్

Centre using p chidambaram s arrest kashmir issue to hide economic slowdown

AIADMK,BJP,CBI,Congress,DMK,Indias GDP growth,INX Media corruption case,K palaniswami,Kashmir,MK Stalin, Chidambaram,US

Lashing out at the NDA government over the GDP growth, the DMK on Wednesday alleged issues like the arrest of senior Congress leader P Chidambaram and Kashmir were being used by it to hide the 'alarming' economic slowdown

ఆర్ధిక మాంద్యం నుంచి ప్రజల దృష్టిమరల్చుతున్న కేంద్రం: స్టాలిన్

Posted: 09/05/2019 06:42 PM IST
Centre using p chidambaram s arrest kashmir issue to hide economic slowdown

దేశ ప్రజలకు ఆర్థిక మందగమనం విషయాలు తెలియకుండా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం.. దేశప్రజల దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించేందిందని డీఎంకే అధినేత స్టాలిన్ అరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎప్పుడో 27 ఏళ్ల కిత్రం ఇలాంటి జీడీపీ వృద్ధి రేటు నమోదైందని పేర్కోన్న ఆయన ఆ స్థాయికి మళ్లీ మోడీ హయంలో ఘోరంగా పడిపోయిందని దుయ్యబట్టారు. నోట్ల రద్దు వ్యవహారంతో దేవ అర్థిక పరిస్థితి మెరుగవుతుందన్న అంచనాలు బెడిసికొట్టాయి.

ఆర్థిక మందగమనాన్ని దాచి పెట్టేందుకు చిదంబరం అరెస్ట్, కశ్మీర్ అంశాలను కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. జూన్ త్రైమాసికానికి స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందని, గత 27 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి బలహీన వృద్ధి రేటును చూడలేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా.. ఆ వార్తలు మాత్రం అటు ప్రింట్ మీడియాలో కానీ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రాకపోవడం దారుణమన్నారు.

బ్యాంకులు కళకళలాడుతున్నాయని కల్లబోల్లి మాటలు చెప్పిన బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వాస్తవిక పరిస్థితులను ప్రజల వద్ద దాచిపెట్టిందని స్టాలిన్ విమర్శించారు. భారత జీడీపీ వృద్ధి రేటు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ పడిపోయింది.  జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది. డిమాండ్ తగ్గడం, ప్రైవేటు పెట్టబడులు నెమ్మదించడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ట్యాగ్‌ను ఈ ఏడాదిలో కోల్పోయిన భారత్.. జీడీపీ వృద్ధి రేటులో చైనా(6.2శాతం) కంటే దిగువున ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  BJP  CBI  Congress  DMK  Indias GDP growth  INX Media corruption case  K palaniswami  Kashmir  MK Stalin  Chidambaram  US  

Other Articles