తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర లాంచీ బోల్తా ఘటన పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గల్లంతైనవారిలో ఇదివరకే 8 మృతదేహాలు రెస్క్యూ బృందాలు వెలికి తీశారు. ఇవాళ ఉదయం మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఇందులో నెలల వయసున్న పసి పాప కూడా ఉండటం బాధిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో గల్లంతైన వారి కోసం స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
క్షత్రగాత్రులకు ముఖ్యమంత్రి జగన్ పరామర్శ
హెలికాప్టర్ ను కూడా రంగంలోకి దించిన అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. గల్లంతైన వారికోసం అన్వేషిస్తున్నారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి బయల్దేరారు. లాంచీ బోల్తా పడిన కచ్చులూరు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
దేవీపట్నం మండలం మంటూరు-కచ్చులూరు దగ్గర గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు పర్యాటకులతో వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో లాంచీలో 60మందికిపైగా పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. సుడిగుండం, లాంచీకి రాయి తగలడం వల్ల ఒక్కసారిగా లాంచీ బోల్తాపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 27మంది సురక్షితంగా బయటపడగా.. 39 మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని మంత్రులు కన్నబాబు, ఆళ్లనానిలు పరామర్శించారు. బాధితుల వివరాల గురించి ఆరా తీశారు.. వారిని ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. కోలుకున్న తర్వాత సొంత ఊర్లకు పంపేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రమాద సమయంలో పర్యాటకులు చాలామంది లైఫ్ జాకెట్లు వేసుకోలేదని మంత్రులు చెబుతున్నారు. లాంచీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతండటంతో చాలామంది జాకెట్లు వేసుకోలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more