Opposition resolves to fight against uranium mining యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం: పవన్ కల్యాణ్

Opposition resolves to fight against uranium mining in nallamala

Pawan Kalyan, Janasena, allegations, all party meet, Uttamkumar reddy, chada venkat reddy, Uranium, Nallamala, kadapa, pulivendula, Telangana, Andhra Pradesh, Politics

Jana Sena party President Pawan Kalyan demanded that the Telangana government should withdraw all permissions accorded for uranium mining as well as exploration across the State, along with the leaders from various political parties.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం: పవన్ కల్యాణ్

Posted: 09/16/2019 08:52 PM IST
Opposition resolves to fight against uranium mining in nallamala

పర్యావరణం నాశనం చేస్తూ.. ప్రజలతో పాటు పశుపక్షాదుల ప్రాణాలకు హరించే ప్రమాదం పోంచి వుందని తెలిసి చాలా బాధగా ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అభివృద్ది పేరిట అడవుల విధ్వంసం జరుగుతుంటే రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పవన్ మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని ప్రజాసమ్యలపై పోరాడతానన్నాని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు తమ జనసేన పార్టీ సిద్దమని చెప్పారు.

యురేనియం తవ్వకాలతో… వాతావరణం కలుషితం అవుతుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పర్యావరణాన్ని నాశనం చేసే ఇలాంటి తవ్వకాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన అవసరముందని అన్నారు. హైదరాబాద్ లో జనసేన ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ భేటీలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎంపీ రేవంత్ రెడ్డి, కోదండరాం, చాడవెంకట్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

అసెంబ్లీ, మండలిని తండ్రికొడుకులు కేసీఆర్, కేటీఆర్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు ఎంపీ రేవంత్ రెడ్డి. యురేనియం తవ్వకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేస్తూ…ఫారెస్ట్ అడ్వైజరీలో ఏకవాక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలతో చెంచులు, వన్యప్రాణులకు హాని జరుగుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. నల్లమలను కాపాడే వరకు పోరాటం చేయాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి.

పెద్దగట్లు, అమ్రాబాద్ ప్రకృతి ఇచ్చిన సంపదన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఉద్యమాలు చేయాలని సూచించారు. యురేనియం తవ్వకాలు రాష్ట్రానికి చాలా ప్రమాదకరమన్నారు టీజేఎప్ అధ్యక్షుడు కోదండరాం. అడవిలో యురేనియం అన్వేషణను కూడా ఆపాలన్నారు. అఖిలపక్షం చేసిన తీర్మానంపై సీఎం కేసీఆర్ మొదటి సంతకం చేయాలన్నారు నేతలు. యురేనియం తవ్వకాలపై పోరాటానికి రెండు రాష్ట్రాల తరుపున ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  all party meet  Uttamkumar reddy  chada venkat reddy  Uranium  Nallamala  Telangana  

Other Articles