Pawan Kalyan suggests to read vanavasi book పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: పవన్ కల్యాణ్

Pawan kalyan suggests to read vanavasi book

Pawan Kalyan, Janasena, allegations, all party meet, Vanavasi book, banabasi book, chenchu leader, Mallikarjun, Revanth reddy, Kodandaram, Uranium, Nallamala, kadapa, pulivendula, Telangana, Andhra Pradesh, Politics

Jana Sena party President Pawan Kalyan suggests telugu states people to read vanavasi book as it turns every individual eco friendly person.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: పవన్ కల్యాణ్

Posted: 09/18/2019 11:11 AM IST
Pawan kalyan suggests to read vanavasi book

నల్లమల అడువుల పరిరక్షణ, యురేనియం తవ్వకాలను వ్యతిరేకించి పర్యావరణ పరిరక్షించుకుందామని తన జనసేన పార్టీ అధ్వర్యంలో అఖిలపక్ష సమవేశాన్ని నిర్వహించిన జనసేనాని పవన్ కల్యాన్.. అఖిలపక్ష సమవేశంతో తన పని ముగిసిందని కాకుండా.. రాష్ట్రప్రజలను చైతన్యపరుస్తూ పర్యావరణాన్ని ప్రేమించాలని అందుకు దోహదపడే పుస్తకాలను కూడా చదవాలని సూచిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు, తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఈ పుస్తకాన్ని చదవాలని కోరుతున్నారు.

సొమవారం అఖిలపక్షం సమావేశం నిర్వహించిన తరువాత కూడా ఆయన అదే సమస్యను పదే పదే ప్రజల ముందుకు, ప్రభుత్వం ముందుక తీసుకువస్తున్నారు. ఇది పర్యావరణంపై తనకున్న ప్రేమను చాటుతుందగా, ఓ సమస్యపై ఆయనకున్న కమిట్ మెంట్ ను కూడా తెలియజేస్తుందని అంటున్నారు జనసైనికులు. అఖిలపక్ష సమావేశానికి వచ్చిన చెంచు నాయకుడు మల్లిఖార్జున్ మాటల్లోని అవేదనను మంగళవారం తెలుగు రాష్ట్రవాసులతో పంచుకున్న పవన్ కల్యాన్ తాజాగా మరో విషయాన్ని ఇవాళ పంచుకున్నారు.

తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా నల్లమల అంశంపైనే ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా, వనవాసి అనే అనువాద పుస్తకం గురించి పవన్ స్పందించారు. బనవాసి (తెలుగులో వనవాసి) అనే పుస్తకాన్ని 1938లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రచించారని, దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని పేర్కొన్నారు. తాను టీనేజ్ లో ఉండగా మద్రాస్ బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొన్నానని వివరించారు.

ఒక్కసారి ఈ పుస్తకం చదివితే ఎవరైనా ప్రకృతి ప్రేమికులుగా మారిపోతారని, అడవుల సంరక్షణ కోసం ముందుకు కదులుతారని నమ్మకం వ్యక్తం చేశారు. వనవాసి పుస్తకం ప్రకృతిపై తన ప్రేమను మరింత పెంచిందని తన ట్వీట్ లో వెల్లడించారు. అంతేకాకుండా, జర్మన్ రచయిత పీటర్ వోలెబెన్ రచించిన ది సీక్రెట్ నెట్ వర్క్ ఆఫ్ నేచర్ పుస్తకాన్ని కూడా ట్వీట్ చేశారు. దీంతో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశంపై ఆయన తీవ్రంగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  Vanavasi book  banabasi book  Uranium  Nallamala  Telangana  

Other Articles