Delhi police slap FIR on Lakshmi Vilas Bank లక్ష్మీ విలాస్ బ్యాంకు డైరెక్టర్లపై కేసులు

Delhi police fir against lakshmi vilas bank directors singh brothers

lakshmi vilas bank, laxmi vilas bank, lakshmi vilas bank stock, lakshmi vilas bank share, lakshmi vilas bank news, religare finvest, fir against lakshmi vilas bank, case against lakshmi vilas bank, shivinder singh, malvinder singh, Economic Offences Wing, Delhi, Crime

AIADMK leader K T Rajendra Bhalaji hit out at Congress before the by-elections at Nanguneri, and said that the Congress MP Manickam Tagore who is sitting in Delhi is doing nothing but release press statements.

లక్ష్మీ విలాస్ బ్యాంకు డైరెక్టర్లపై చీటింగ్, కుట్ర సెక్షన్ల కింద కేసులు

Posted: 09/28/2019 01:10 PM IST
Delhi police fir against lakshmi vilas bank directors singh brothers

ప్రైవేటు రంగానికి చెందిన లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్‌ను బ్యాంకు దుర్వినియోగం చేసిందంటూ రెలిగేర్ ఫిన్‌వెస్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీలోని కన్నాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్థిక నేర విభాగం (ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్) బ్యాంకు బోర్డు డైరెక్టర్లపై మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలను నమోదు చేసిందని బ్యాంకు యాజమాన్యం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు సమాచారం అందించింది.

రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రెలిగేర్ ఫిన్ వెస్ట్ లిమిటెడ్ సంస్థ ఈ బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తం దుర్వినియోగం అయ్యిందని. దీని వెనక భారీ కుట్ర ఉన్నట్టు అనిపిస్తోందని రెలిగేర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఎల్‌వీబీ కేంద్రంగా ఇది నడిచినట్టు ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు మొత్తం బ్యాంకు బోర్డుపైనా, లేక కొందరు డైరెక్టర్లపైనేనా అన్నది తెలియరాలేదు. ఎల్‌వీబీపై ఫిర్యాదుతో ఆ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా పతనం చెందాయి. ఎన్ఎస్‌ఈలో షేరు విలువ రూ.36.50 వద్ద, బీఎస్‌ఈలో రూ.36.55 వద్ద ముగిసింది.

కాగా బ్యాంకు మోసానికి పాల్పడటంతో ఆర్ఎఫ్ఎల్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఆ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంకు డైరెక్టర్లు.. పలువును బ్యాంక్ ఉద్యోగులుతో పాటు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లపైనా కేసులు నమోదు చేసింది. వీరితో పాటు ఆర్ హెచ్ సి హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్, రాన్ కెమ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలతో పాటు ఆయా సంస్థల్లోని పలువురు క్రియాశీలక స్థానాల్లో వున్న ఉద్యోగులపైన కూడా కేసులు పెట్టింది. రిలిగేర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థను గతేడాది ఫిబ్రవరి 14 వరకు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ ల ఆధ్వర్యంలోనే నడించింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles