Man in spotlight for TV kiss మహిళా రిపోర్టర్ కు లైవ్ లో ముద్దు..

Tv reporter responds to stranger who kissed her during live broadcast

sara rivest, TV reporter, LIve TV, women reporter, wave 3 news, feminism, harrassment, Kentucky, kiss, TV News, America, Crime

A Kentucky TV reporter is speaking out after a stranger kissed her during a live broadcast. Sara Rivest, who works for WAVE-TV in Louisville, Ky., was broadcasting outside a bourbon festival when a man in sunglasses entered the frame and kissed her on the cheek.

ITEMVIDEOS: మహిళా రిపోర్టర్ కు లైవ్ లో ముద్దు.. యువకుడు అరెస్టు

Posted: 09/28/2019 10:53 AM IST
Tv reporter responds to stranger who kissed her during live broadcast

అగ్రరాజ్యం అమెరికాలోని కెంటుకీ నగరంలో ఓ మహిళా జర్నలిస్టుకు పరాభవం ఎదురైంది. లైవ్ లో వార్తలు రిపోర్టు చేస్తున్న అమెకు బుగ్గన ముద్దాడబోయాడు ఓ ఆగంతకుడు. అతడి ప్రయత్నాన్ని చిట్టచివరి క్షణంలో పసిగట్టిన రిపోర్టర్ పక్కకు ఒరిగి.. తప్పించుకుంది. దీంతో బిత్తరపోయిన జర్నలిస్టు క్షణంలో తేరుకుని తన న్యూస్ ను యధావిధిగా కొనసాగించింది. ఆ తరువాత ముద్దుపెట్టిన అగంతకుడు కటకటాలను లెక్కపెడుతున్నాడు.

అమెరికాలోని ‘వేవ్ 3’ న్యూస్ చానల్ లో పనిచేస్తున్న సారా రివస్ట్..  కెంటుకీ నగరంలోని ఓ ప్రధాన రోడ్డుపై నిలబడి.. అక్కడి సమాచారాన్ని స్టూడియోలో న్యూస్ రూములో ఉన్న యాంకర్‌కు లైవ్‌లో అందిస్తోంది. ఈ సమయంలో కొందరు అటుగా వెళ్లారు. వారిలో ఓ వ్యక్తి నల్లని కళ్లజోడు ధరించి వచ్చాడు. కొద్దిసేపు వెనకాలే నిలబడి.. వెళ్లాడు. అయితే దీంతో తాను టీవీలో కొద్దిసేవు మాత్రమే కనబడతానని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. తన గురించి మాట్లాడుకునేలా చేయాలని భావించాడేమో.. మహిళా జర్నలిస్టు బుగ్గన ముద్దాడటానికి వచ్చాడు.

తన వైపుగా ఓ యువకుడు వస్తున్న విషయాన్ని ఓ కంట కనిపెట్టిన మహిళా జర్నలిస్టు.. చివరి క్షణంలో అగంతకుడు పెట్టే ముద్దు నుంచి పక్కకు జరిగి తప్పించుకుంది. అయితే ఆమెపైకి అమాతంగా ఒరిగిన అగంతకుడు అమె బుగ్గను అందుకోవడంలో విఫలమై.. వెంటనే తేరుకుని తదనంతర పరిణామాలను ఊహించుకున్నాడో ఏమో కానీ అక్కడి నుంచి తుర్రుమన్నాడు. అతడి చర్యకు క్షణకాలంపాటు బిత్తరపోయిన సారా.. వెంటనే తేరుకుని మళ్లీ తన వార్త  ప్రపంచంలో నిమగ్నమైయ్యింది.

వార్తలు అందించిన తరువాత అమెతో లైవ్ లోనే టీవీ చానల్ ఉన్నతాధికారి నీకు ఎదురైన అనుభవంపై నీకు పోలీసులు సాయం కావాలా.? అని అడగ్గా అమె అందుకు సరేననింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అగంతకుడి చర్యపై పిర్యాదు తీసుకున్నారు. నిందితుడిని ‘గుడ్‌మ్యాన్’గా గుర్తించిన పోలీసులు అతను రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ గా గుర్తించారు. అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఇక సారా మాత్రం.. నీకు కావాల్సిన మూడు నిమిషాల ఫేమ్ ఇదిగో.. అంటూ అతడు చేసిన దుశ్చర్య వీడియోను నెట్టింట్లో  పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sara rivest  TV reporter  LIve TV  women reporter  wave 3 news  feminism  harrassment  Kentucky  kiss  TV News  America  Crime  

Other Articles