దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్ అందించింది. తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో కస్టమర్లు స్టేట్ బ్యాంక్‌కు వెళ్లి తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు పొందొచ్చు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నవారు.. ఎస్బీఐ హోమ్ లోన్ తో దానిని పూర్తి చేసుకోవచ్చు.
అదేంటి భారతీయ స్టేట్ బ్యాంకునే ఎందుకని అంటారా.? ఎందుకంటే ఈ బ్యాంకు మాత్రమే అన్ని బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలను మంజూరు చేస్తోంది. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు విధానంలో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15 శాతం నుంచి ప్రారంభమౌతోంది. దీంతో ఇప్పుడు మీరు సొంతిల్లు కల సాకరం చేసుకునే అవకాశం లభించినట్టే. ఈ అతితక్కువ వడ్డీ అక్టోబర్ 1 నుంచి ఈ రుణాలు అందుబాటటులోకి వస్తాయి’’ అని స్టేట్ బ్యాంక్ ట్వీట్ చేసింది.
విజయదశమి రోజును ఏది ప్రారంభించినా.. ఈ నవరాత్రులన్ని రోజులు ఏం చేపట్టినా విజాయాన్ని అందిస్తోందన్న సెంటిమెంట్ దేశ ప్రజల్లో వుంది. దీంతో అదే సెంటిమెంట్ మేరకు దసరా, దీపావళి రోజున పండుగ సీజన్లో హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్. ఇకపోతే ఎస్బీఐ రెపో రేటు అధారిత హోమ్ లోన్స్‌ను మళ్లీ ఆఫర్ చేస్తామని ఇదివరకే పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి రుణాలు అందుబాటులోకి వస్తాయి. కాగా బ్యాంక్ ఈ ఏడాది జూలై 1న ఈ రుణాలు ఆవిష్కరించింది.
అయితే తర్వాత ఈ రుణాలను ఉపసంహరించుకుంది. ఇప్పుడు మళ్లీ వీటిని కొన్ని మార్పులతో కస్టమర్లకు అందించేందుకు సిద్ధమైంది. కాగా మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలు పొందేందుకు అర్హతలను మాత్రం వెల్లడించలేదు. రుణం తీసుకోవాలని భావించే వారు ఈ లింక్‌పై క్లిక్ చేసి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఎస్బీఐ పలు అంశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more