అదృష్టం అన్నది నుదుటన రాసి వుంటే అది ఆకాశంలో వున్నా.. లేక పాతాళంలో వున్నా సమయం వచ్చినప్పుడు తప్పక వరిస్తుందని పెద్దలు చెబుతుంటారు. మొన్నా మధ్య ఓనమ్ పండుగ రోజు జ్యూవలరీ దుకాణంలో పనిచేసే ఆరుగురు మిత్రులు కలసి లాటరీ టికెట్ కొంటే వారికి ఏకంగా ప్రథమ బహుమతిగా ఏకంగా రెండు కోట్ల రూపాయల లాటరీ డబ్బు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారు రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు.
అయితే అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేమన్నది వాస్తవం! ఈ రిక్షావాలా విషయంలో అది నిజం అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన గౌర్ దాస్ వర్షం కారణంగా లాటరీలో రూ.50 లక్షలు గెలుచుకోవడం అదృష్టం కాక మరేంటి? గౌర్ దాస్ నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ లో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెప్టెంబరు నెలాఖరులో ఇతర రిక్షావాలాలతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
అయితే, విహారయాత్రకు వెళ్లే రోజున భారీ వర్షం కురిసింది. దాంతో ఆ యాత్ర క్యాన్సిల్ అయింది. రిక్షా యూనియన్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా, లాటరీలు అమ్మే ఓ వ్యక్తి ఎదురొచ్చి లాటరీ కొనాలంటూ వెంటపడ్డాడు. లాటరీ విలువ రూ.30 మాత్రమే కావడంతో, సరేనని చెప్పి ఓ లాటరీ కొనుగోలు చేశాడు గౌర్ దాస్. అయితే దానిపైనా అంత నమ్మకం పెట్టుకోని గౌర్ దాస్ టికెట్ ను ఇంట్లోనూ పెట్టేశాడు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత తొటి రిక్షా కార్మికులు లాటరీ ఫలితాలు వచ్చయని అంటుంటే విన్నాడు గౌర్ దాస్.
దీంతో వారం క్రితం వచ్చిన లాటరీ ఫలితాలను రెండు రోజుల ఆలస్యంగా చూసుకున్నాడు. ఫలితాలను చూడగానే ఆతడి గుండె అగినంత పనైంది. ఎందుకంటే తాను కొన్న లాటరీ నంబర్ కు రూ.50 లక్షల బహుమతి వచ్చింది. ఈ విషయం తెలిసి ఆ రిక్షావాలా ఆనందం అంతాఇంతా కాదు. అయితే, తన ఆనందాన్నంతా తన హృదయంలోనే దాచుకున్న గౌర్ దాస్.. తొలుత లాటరీ డబ్బు వచ్చే మార్గం ఎలా అన్ని విషయాన్ని తెలుసుకుని తదనంతర పనులను ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా పూర్తి చేశాడు.
ఎవరికన్నా తెలిస్తే, ప్రమాదం అని భావించిన ఆయన ఈ ఆనందాన్ని కేవలం తన భార్యతో మాత్రమే పంచుకున్నాడు. ఇక లాటరీలో వచ్చిన డబ్బును ఆధారాలతో పాటుగా తన బ్యాంకు అకౌంట్లో జమ చేసిన గౌర్ దాస్ అప్పుడు తాపీగా ఊపీరిపీల్చుకున్నాడు. తన వద్ద అంత డబ్బు వుందని తెలిస్తే ప్రమాదమని బావించిన అతను ఇలా చేశాడు. తాను ఓ మంచి ఇల్లు కొనుకున్ని తన కష్టాల నుంచి గట్టెక్కిన తరువాత ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకోవాలని భావించాడు.
అయితే తాను ఒకటి తలిస్తే.. దైవం మరోటి తలచిందన్న చందాన.. రిక్షావాలాకు లాటరీలో యాభై లక్షల రూపాయలు వచ్చిందని సమాచారం తెలుసుకున్న మీడియా.. ఈ విషయాన్ని మొత్తంగా తెలిసెలా చేసింది. అయితే మొత్తం డబ్బును తాను వాడుకోనని అందులో సుమారు ఐదు లక్షల రూపాయలను నలుగురికి సాయం చేసేందుకు వెచ్చిస్తానని కూడా గౌర్ దాస్ మీడియాతో చెప్పాడు. ఇలా వరుణుడి కటాక్షంతో ఓ రిక్షావాలాను ధనవంతుడయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more