IAS panel fails to resolve TSRTC demands పండుగ వేళ ఆర్టీసీ కార్మక అన్న ఆగ్రహం..

Ias panel fails to resolve demands tsrtc staff to go on strike

telangana road transport, telangana k chandrashekhar rao, telangana farmers, ranga reddy farmer, telangana revenue officer. KCR, TS RTC employees, staff, demands, ias committee, talks fail, somesh kumar,TSRTC Strike, Telangana

CM K Chandrashekhar Rao appointed Three member IAS committees to resolve TSRTC Staff demands after holding talks.

ఆర్టీసీ సమ్మె: చర్చలు విఫలం.. ఆగనున్న ప్రగతి చక్రం..

Posted: 10/02/2019 06:41 PM IST
Ias panel fails to resolve demands tsrtc staff to go on strike

తెలంగాణలో పండగ వేళ ఆర్టీసీ కార్మికుడు కన్నెర్ర చేశాడు. ఈ నెల 5వ తేదీ తాము యాజమాన్యానికి ఇచ్చిన నోటీసు మేరకు సమ్మె చేపట్టబోతున్నామని ఇవాళ క్లారిటీ ఇచ్చాడు. ఆర్టీ యాజమాన్యంతో ఇవాళ జరగిన చర్చలు విఫలమైన ఆనంతరం టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని.. ఈ నేపథ్యంలో తాము సమ్మెను చేపట్టనున్నామని తెలిపారు.

సోమేశ్ కుమార్ కమిటీతో జరిగిన చర్చల్లో తమ సమస్యల పరిష్కారంతో పాటు న్యాయమైన డిమాండ్లపై ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని చెప్పారు. తాము సమస్య పరిష్కారం దిశగానే ఆలోచిస్తున్నామని... అయితే తమ డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం కూడా కృషి చేయాలని అన్నారు. గతంలో కూడా ప్రభుత్వం కమిటీలను వేసిందని... అవి నివేదికలు ఇవ్వలేదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం చేపట్టిన విధంగా ఇక్కడ కూడా అర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలన్న డిమాండ్ తో పాటు తమ 26 డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాడతామని తెలిపారు. తమ డిమాండ్లలో 2, 3 అంశాలు తప్ప మిగిలిన అంశాలన్నీ పరిష్కరించేవేనని చెప్పారు. ఆర్టీసీ కార్మికులంతా పోరాటానికి సిద్ధం కావాలని విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  TS RTC employees  staff  demands  ias committee  talks fail  somesh kumar  TSRTC Strike  Telangana  

Other Articles