BJP MP Ram Kripal Yadav falls into river in Patna నదిలో పడ్డ బీజేపి ఎంపీ రాంకిృపాల్ యాదవ్

Bjp mp ram kripal yadav falls into river in patna during visit to flood hit areas

2014 Patna stampede, Bihar floods, BJP, BJP MP, BJP MP falls off boat, Pataliputra, Patna, Ram Kripal Yadav, Dhanarua block, Dardha River, Bihar, Bihar flood, aide for Bihar, floods relief funds, Flood ravage, Bihar, floods relief funds, centre aid, Bihar, Politics

BJP MP and former Union minister Ram Kripal Yadav on Wednesday night fell into a river near while he was on his way to a flood-hit area falling in his parliamentary constituency.

ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లి నదిలో పడ్డ బీజేపి ఎంపీ

Posted: 10/03/2019 11:58 AM IST
Bjp mp ram kripal yadav falls into river in patna during visit to flood hit areas

తమ సమస్యలను తీర్చని నేతలను మీరొకసారి వచ్చి చూస్తే.. మా బాధలేంటో మీకు అర్ధం అవుతాయని కష్టాల్లో వున్న ప్రజలు నాయకుల్ని నిలదీయడం మనకు అక్కడక్కడా కనిపిస్తోంది. అయితే ఇలా ప్రజలు తమను నిలదీసేందుకు ముందుగానే తమ బాధ్యతగా ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. తమ నియోజకవర్గ ప్రజలు వరద నీటిలో పడే పాట్లను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వచ్చి.. ప్రమాదవశత్తూ నదిలో పడిపోయారు. పడితే పడ్డారు కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి ఈ సందర్భాన్ని చాలా చక్కగా వాడుకున్నారు తెలివైన ఎంపీగారు..

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు బుధవారం రాత్రి నాటు పడవలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ తృటిలో నదీలో మునిగిపోకుండా తప్పించుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. బీహార్  రాష్ట్రాన్ని కొద్దిరోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. నడుం లోతు నీరు నిలిచిన ధనురువా ప్రాంతాన్ని  పరిశీలించేందుకు ఎంపీ కృపాల్ యాదవ్ బుధవారం రాత్రి బయల్దేరి వెళ్లారు. నదికి అవతలి గట్టున్న ప్రాంతంలో వరద పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుని ఓ పడవ ఎక్కారు.

అక్కడ ఆ మాత్రం పడవ దొరకడమే ఎంపీగారికి గగనమైపోయింది. నది అవతలి గట్టుకు వెళ్లేందుకు ఆ సమయంలో బోటు అందుబాటులో లేదు. వరదలో చిక్కుకున్న గ్రామస్థులు టైర్ల ట్యూబ్‌లతో తయారుచేసిన బోటులాంటి దాంట్లో బయలుదేరారు. ఎంపీతో పాటు మరికొంతమంది స్థానికులు కూడా ఆ టైర్ల బోటులోకి ఎక్కారు. దాంతో ఎంపీ అదుపు తప్పి నీటిలో పడిపోయారు. స్థానికులు నదిలోకి దూకి ఆయన్ని రక్షించారు. తమ దగ్గరున్న టవర్స్‌తో తుడిచి ఎంపీకి సపర్యలు చేశారు. వారి అభిమానానికి ఎంపీ సంతోషించారు.

‘మీ ఇబ్బందులు  తెలుసుకున్నా.. మీకు తగిన సహాయం అందేలా వెంటనే యాక్షన్ తీసుకుంటా’ అని మాటిచ్చారు. ఎంపీ నదిలో మునిగిపోయారని తెలుసుకుని అక్కడికి మీడియా ప్రతినిధులు పరిగెత్తుకొచ్చారు. బీహార్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, గ్రామీణ ప్రాంతాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఎంపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. వరద ప్రాంతాల్లో పర్యటించడానికి ఎంపీనైన తనకే కనీసం పడవ కూడా దొరకలేదని, సామాన్యుల సంగతేంటని నిలదీశారు. ప్రభుత్వం సహాయం లభించకపోవటం వల్లనే గ్రామస్థులు టైర్లతో ట్యూబులతో తయారుచేసిన పడవను ఉపయోగించాల్సి పరిస్థితి ఉందని తూర్పారబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Kripal Yadav  Dhanarua block  Dardha River  BJP MP  Pataliputra  Patna  Bihar  Politics  

Other Articles