కేరళలలోని ఓ చర్చి బిషప్ తనపై రెండేళ్ల పాటు పాల్పడిన అఘాయిత్యాన్నికి వ్యతిరేకంగా తాను ఏడాది కాలంగా చేస్తున్న పోరాటంతో జుడీషియల్ రిమాండ్ నుంచి తాజాగా బెయిల్ పై వచ్చిన బిషప్ తన వ్యక్తిత్వాన్ని అగౌరవపర్చే విధమైన చర్యలకు పాల్పడుతున్నాడని అత్యాచార బాధితురాలైన నన్ అరోపిస్తొంది. తాజాగా నన్ చేసిన ఆరోపణలు కేరళలో కలకలం రేపుతున్నాయి. బిషప్ తో పాటు అమె సోషల్ మీడియా దిగ్గజమైన యూట్యూబ్, పలు వెబ్ సైట్లను కూడా తప్పబట్టారు.
కొట్టాయంకు చెందిన చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014 నుంచి 2016 మధ్యకాలంలో తనపై ఏకంగా 13 పర్యాయాలు అత్యాచారం చేశాడని బాధితురాలు (43) అరోపించారు. పంజాబ్ లోని మిషనరీలకు సభ్యురాలిగా వ్యవహరిస్తున్న తనపై బిషప్ పాల్పడిన అఘాయిత్యంపై రాష్ట్ర, జాతీయ మహిళా సంఘానికి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే నిందితుడిపై పిర్యాదు చేసినా చర్యలు తీసుకోడానికి పోలీసులు వెనుకంజ వేయడంతో.. అమె న్యాయస్థానాన్ని అశ్రయించారు. దీంతో కోర్టు అదేశాల మేరకు అరెస్టు చేసిన పోలీసులు తరువాత బెయిల్ లభించడంతో వదిలివేశారు.
కాగా తాజాగా బాధితురాలు.. బిషప్ పై మరో అరోపణలు చేస్తోంది. తనపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ సందర్భంగా రహస్యంగా తీసిన ఫొటోలను తాజాగా బిషప్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన పరువును తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదును మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆమె ఆరోపణలపై విచారణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అఘాయిత్యం నేపథ్యంలో తమ మధ్య జరిగిన సంబాషణలను కూడా బిషప్ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేయడం.. వాటిని వీక్షకులందరికీ అందుబాటులోకి ఛానెల్ తీసుకురావడంపై కూడా అమె అక్షేపణలు వ్యక్తం చేసింది.
ఇక దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు ఇచ్చిన అదేశాలను తుంగలో తొక్కుతూ.. పలు వైబ్ సైట్లు తన వ్యక్తిగత వివరాలతో పాటు తన ఫోటోలను కూడా ప్రచురించాయని అమె అరోపించారు. అత్యాచారం జరిపిన బిషప్ పై తాను చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాల్సిన వారు.. ఇలా చేయడంపై అమె పలు ప్రశ్నలు సంధించారు. అయితే బిషప్ కావాలని తన వ్యక్తిత్వంపై, క్యారెక్టర్ ను కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాగా ఈ కేసు విషయంలో ఏర్పాటు చేసిన సిట్ న్యాయస్థానంలో చార్జిషీటును దాఖలు చేసిందని, నవంబర్ 11 నుంచి ఈ కేసులో ట్రయల్ ప్రారంభమవుతుందని ఎస్ఓఎస్ అధికార ప్రతినిధి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more