యావత్తు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన హుజూర్నగర్ ఉప-ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి రికార్డు బ్రేక్ చేస్తూ.. 43 వేల ఓట్ల పైచిలుకుతో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీ అభ్యర్థి సహా.. టీడీపీ పార్టీ అభ్యర్థులకు కూడా డిఫాజిట్లు గల్లంతయ్యాయి. ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బ్రేక్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూర్ నగర్ ను తమ కంచుకోటగా మార్చుకునేందుకు నాంది పలికింది.
ఈ క్రమంలో హుజూర్ నగర్ ప్రజలు తీర్పును స్వాగతించిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ గెలుపు ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసానికి, నమ్మకానికి ప్రతిభింభించాయని అన్నారు. కాగా ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు ఒక గుణపాఠమని అన్నారాయన. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ప్రభుత్వంపై బురదజల్లే యత్నాలను మానుకోవాలని సూచించారు. లేని పక్షంలో ప్రతిపక్షాలను కూడా ప్రజలు మర్చిపోయే రోజులు వస్తాయని అన్నారు. ప్రతిపక్షాలు మీడియా ముందు అరవడం కన్నా.. ప్రజల్లోకి వెళ్లాలని ఆయన అన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీపై మంత్రి తలసాని తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. ఓ వార్డు సభ్యుడికి వచ్చిన ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మీడియాను ముందు ఫసలేని విమర్శలు చేస్తూ.. అరిచిన అరుపులకు ప్రజలే ఓట్లతో వారి విమర్శలను తిప్పికొట్టారని అన్నారు. ప్రభుత్వ పనితీరుకు హుజూర్ నగర్ ఫలితాలు ఒక నిదర్శనమని అన్నారు. ఆరు దశాబ్దాలలో జరగని అభివృద్ధి గడిచిన 5 సంవత్సరాలలో జరిగిందని తలసాని వ్యాఖ్యానించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more