ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టిన ఆడపిల్లలు మళ్లీ సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు వారి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయన్నది వాస్తవం. అయితే దీనిని కొందరు బయటకు కనిపించేలా చేయగా, మరికొందరు ధైర్యంగా వుంటారు. ఇందుకు సమాజంలో వున్న మానవమృగాళ్లే కారణం. ఎవరో ఒకరు ఎక్కడో తప్పుచేస్తే.. చుట్టుముట్టి చితకబాది వాడికి శిక్షపడేలా చేసే సభ్య సమాజంలోని మనుషులు క్రమంగా తమ పనులు, తమ వ్యవహరాలతో బిజీగా మారిపోతూ.. ఎవరికో ఏదో జరిగితే తామెందుకు స్పందించాలి.. ఎందుకు సాయం చేయాలన్న భావన ఉత్పన్నం కావడం కూడా కారణమే.
అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నేరాలు, నేరగాళ్లతో నిత్యం సవాళ్లను ఎదుర్కోంటున్న పోలీసులు.. ఓ కేసును చేధించేలోగా మరో కేసును తమ ఎదుట సవాలుగా నిలవడంతో వారు కూడా పరిధి వరకే వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో.. నేరగాళ్ల అకృత్యాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. అసలు ఈ తరహా నేరాలను వారు ఎందుకు ఎంచుకుంటున్నారో తెలుసుకోవాల్సిన పోలీసులు.. వారిని ఎలాంటి శిక్షలు వేసి మనుషులుగా మార్చాలన్న విషయానికి న్యాయస్థానాల్లో చెప్పలేకపోతున్నారు. నేరగాళ్లను అధ్యయనం చేయడానికి అసలు వారికి సమయం సరిపోవడం లేదన్నది కాదనలేని వాస్తవం.
ఈ క్రమంలో నేరగాళ్లు శిక్షలను అనుభవించిన తరువాత.. భయటకు వచ్చిన పిమ్మట కూడా మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడుతుండటంతో మన ఆడపడచులకే భద్రత కరువైంది. మహిళా భద్రత రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇన్నాళ్లు ఆడపిల్లలకు ఇంటి భయటే ప్రమాదం పోంచి వుందన్న భావన పోయింది. రంగారెడ్డి జిల్లాలో ఓ తండ్రే తన కంటిపాపను కాటేసిన వైనంతో ఆడపిల్లలకు కేవలం తల్లి మాత్రమే రక్షణగా వుంటుందన్న భావన ఏర్పాటుతుంది. అయితే తాజాగా వెలుగుచూసిన ఈ ఘటన తల్లి కూడా అవసరాలకు తన బిడ్డను వాడుకుంటుందా.? అన్న అనుమానాలు రేకెత్తకమానవు.
గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సొంత పిన్నే ఆమె పట్ల నీచానికి ఒడిగట్టి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన ఓ యువతి అప్పుడప్పుడు బుక్కాపురంలో పిన్ని ఇంటికి వెళ్లి వస్తుండేది. ఇటీవల కొద్దిరోజుల క్రితం ఆ యువతి పిన్ని ఇంటికి వెళ్లింది. ఓరోజు భోజనంలో యువతికి మత్తు మందు పెట్టిన ఆమె పిన్ని.. అత్యంత నీచానికి ఒడిగట్టింది. యువతి అపస్మారక స్థితిలోకి జారుకున్నాక.. ఓ యువకుడిని ఆమె పక్కన పడుకోబెట్టి అసభ్యంగా ఫోటోలు తీసింది.
అంతే మరుసటిరోజు నుంచి ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని తన కూతురులాంటి బిడ్డనే బెదిరించి డబ్బు లాడగం ప్రారంభించింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలు లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తల్లి తరువాత తల్లి లాంటి స్థానంలో వున్న పిన్ని ఇలాంటి పనికి ఒడిగట్టడంతో అమెపై వున్న ప్రేమాభిమానాలతో ఆమె ఇంటికి వెళ్లిన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో బాధితురాలు మానసిక అందోళనకు గురైంది. ముందుగా పిన్నికి కొంత డబ్బును ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసిన యువతి.. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ చర్యపై ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more